Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబై ఓటమిపై ప్రీతి జింటా 'వెరీ హ్యాపీ': ట్విట్టర్‌లో వీడియో వైరల్

IPL 2018: Kings XI Punjab Co-Owner Preity Zinta Caught Saying Very Happy After Mumbai Indians Fail To Enter Playoffs

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ తుదిదశకు చేరుకుంది. టోర్నీలో భాగంగా ఆదివారం పూణె వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ నాయకత్వంలోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

కాగా, ఈ మ్యాచ్‌కి ముందు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. అయితే, ముంబై ఓడిపోయిందన్న వార్త తెలియగానే కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని, బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా ముందే సంబరపడ్డారు.

 11 పరుగుల తేడాతో ముంబై ఓటమి

11 పరుగుల తేడాతో ముంబై ఓటమి

కాగా, ఈ మ్యాచ్‌కి ముందు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ముంబై జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. అదే సమయంలో తమ జట్టు మ్యాచ్ కోసం పుణెలో ఉన్న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని, బాలీవుడ్‌ నటి ప్రీతి జింటాకు ఈ విషయం తెలిసి తెగ సంబరపడింది.

ఈసారి ముంబై ఫైనల్‌కు వెళ్లడం లేదు

పక్కనే ఉన్న మరో సహ యజమానితో ఆమె మురిసిపోతూ ‘నిజంగా... నాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి ముంబై ఫైనల్‌కు వెళ్లడం లేదు. నేనైతే హ్యాపీ' అని ఆమె పేర్కొన్నట్టు వీడియోలో కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో ఆమెపై ముంబై అభిమానులు సోషల్ మీడియాలో దాడి మొదలుపెట్టారు.

చెన్నైను పంజాబ్ 53 పరుగుల తేడాతో ఓడించాలి

మరోవైపు ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోవాలి.. అలాగే చెన్నైను పంజాబ్ 53 పరుగుల తేడాతో ఓడించాలి. పంజాబ్ కోరుకున్నట్లుగానే ఢిల్లీ.. ముంబైను ఓడించింది. కాకపోతే పంజాబ్ కూడా చెన్నై చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో రెండు జట్లు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి. మ్యాచ్ అనంతరం ప్రీతి జింటా తన ట్విట్టర్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్లకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది.

ముంబై ఓడిపోతేనే తమ జట్టుకు ఛాన్స్

ముంబై ఓడిపోతేనే తమ జట్టుకు ఛాన్స్ ఉంటుందని భావించే ప్రీతి జింటా ఇలా అనుంటుందని నెటిజన్లు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తన జట్టు గెలువకపోయినా పర్వాలేదు గానీ, ముంబై ఇండియన్స్ మాత్రం ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించకపోవడం ఆమెకు ఆనందంగా ఉన్నట్టు ఉందని కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Monday, May 21, 2018, 11:55 [IST]
Other articles published on May 21, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+