Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2018: ప్రీతి జింతా జట్టు కెప్టెన్‌గా రవిచంద్రన్ అశ్విన్

IPL 2018: Kings XI Punjab appoint R Ashwin as new captain

హైదరాబాద్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కొత్త కెప్టెన్ ఖరారయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ ఆల్ రౌండర్‌ను వేలంలో సొంతం చేసుకున్న జట్టు అతన్నే కెప్టెన్‌గా సోమవారం ప్రకటించింది. 2018 ఐపీఎల్ సీజన్‌కు గాను పంజాబ్ జట్టుకు నాయకుడిగా అశ్విన్ కొనసాగనున్నాడంటూ జట్టు సహ యజమాని వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

వేలానికి ముందు పంజాబ్ జట్టు కేవలం భారత్‌కు చెందిన ఆల్ రౌండర్ అక్సర్ పటేల్‌ను అట్టి పెట్టుకుని అందరినీ వేలానికి వదిలిపెట్టేసింది. అక్సర్ పటేల్‌ను రూ. 12.5కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి లీగ్ టైటిల్‌ను గెలుచుకోవాలనే ఆరాటంలో పంజాబ్ జట్టు ఆరాటపడుతోంది. పదేళ్లుగా సాధించలేని విజయాన్ని 2018 ఐపీఎల్ సీజన్‌లో నెరవేర్చుకోవాలని సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు 21 మంది ప్లేయర్లను సొంతం చేసుకున్న పంజాబ్ జట్టు వేలంతో కలిపి రూ.80 కోట్ల వరకు ఖర్చు చేసింది.

ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరుపున యువరాజ్ సింగ్, బ్రెట్ లీ, శ్రీశాంత్ ఆటగాళ్లు ఆడారు. దీంతో టైటిల్ ఫేవరేట్లలో ఒకటిగా నిలిచింది. అయితే జట్టుగా సమిష్టి ప్రదర్శన చేయడంలో పంజాబ్ జట్టు విఫలమైంది. అయితే 2014లో జట్టు సారథ్య బాధ్యతలను ఆస్ట్రేలియా జట్టు ఆటగాడు జార్జి బెయిలీకి అప్పగించిన తర్వాత అద్భుత ప్రదర్శన చేసింది. ఆ ఏడాది ఫైనల్‌కు కూడా చేరుకుంది. అయితే ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాతి జరిగిన సీజన్లలో పంజాబ్ జట్టు 8వ స్థానానికే పరిమితమైంది.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్

1. అక్షర్ పటేల్ (రూ.12.5 కోట్లు - Retained)
2. అశ్విన్ (రూ.7.6 కోట్లు) (CAPTAIN)
3. యువరాజ్ సింగ్ (రూ.2 కోట్లు)
4. కరుణ్ నాయర్ (రూ.5.6 కోట్లు)
5. కేఎల్ రాహుల్ (రూ.11 కోట్లు)
6. డేవిడ్ మిల్లర్ (రూ.3 కోట్లు - RTM)
7. ఆరోన్ ఫించ్ (రూ.6.2 కోట్లు)
8. మార్కస్ స్టాయినిస్ (రూ.6.2 కోట్లు-RTM)
9. మయాంక్ అగర్వాల్ (రూ.కోటి)
10. అంకిత్‌సింగ్ రాజ్‌పుత్ (రూ.3 కోట్లు)
11. మనోజ్ తివారీ (రూ.కోటి)
12. మోహిత్ శర్మ (రూ.2.4 కోట్లు- RTM)
13. ముజీబ్ జర్దాన్ (రూ.4 కోట్లు)
14. బరిందర్ శరణ్ (రూ.2.2 కోట్లు)
15. అండ్రూ టై (రూ.7.2 కోట్లు)
16. అక్షదీప్ నాథ్ (రూ.కోటి)
17. బెన్ డ్వార్షుయిస్ (రూ.1.4 కోట్లు)
18. ప్ర‌దీప్ సాహు (రూ.20 ల‌క్ష‌లు)
19. మ‌యాంక్ దాగార్ (రూ.20 ల‌క్ష‌లు)
20. క్రిస్ గేల్ (రూ.2 కోట్లు)
21. మంజూర్ దార్ (రూ.20 ల‌క్ష‌లు)

Story first published: Monday, February 26, 2018, 16:06 [IST]
Other articles published on Feb 26, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+