Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విలియమ్సన్ అరుదైన ఘనత: ఐపీఎల్‌ చరిత్రలో ఐదో ఆటగాడిగా

Kane Williamson

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా ముంబైలోని వాంఖడె స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతోన్న ఐపీఎల్ ఫైనల్లో సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఒక సీజన్‌లో ఏడొందలకు పైగా పరుగులు సాధించిన ఐదో ఆటగాడిగా విలియమ్సన్‌ గుర్తింపు సాధించాడు.

ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న ఫైనల్లో మ్యాచ్‌ ద్వారా విలియమ్సన్‌ ఈ ఘనతను నమోదు చేశాడు. పైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ (47) మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఈ సీజన్‌లో అద్భుతమైన ఆటతీరు కనబర్చిన విలియమ్సన్ 735 పరుగులు నమోదు చేశాడు.

అంతేకాదు ఐపీఎల్ 11వ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్‌ని కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. 2016లో జరిగిన సీజన్‌లో విరాట్ కోహ్లీ ఏకంగా 976 పరుగులు చేశాడు. ఆ తర్వాతి స్థానంలో డేవిడ్ వార్నర్ అదే ఏడాది 848 పరుగులు చేసి సన్ రైజర్స్‌ని టైటిల్ విజేతగా నిలిపాడు.

1
43470

కాగా ప్రస్తుతం కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానంలో క్రిస్ గేల్ (733 పరుగులు, 2013), మైక్ హస్సీ (733 పరుగులు, 2013), క్రిస్ గేల్ (708 పరుగులు, 2013) ఉన్నారు. ఐపీఎల్‌లో రెండు సార్లు 700కిపైగా స్కోర్లు చేసిన ఒకే ఒక్క ఆటగాడు గేల్ మాత్రమే.

Story first published: Sunday, May 27, 2018, 20:43 [IST]
Other articles published on May 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+