IPL 2018: 'Just like Sachin' - పృథ్వీ షాపై ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం

హైదరాబాద్: అండర్-19 వరల్డ్ కప్ కెప్టెన్, ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఓపెనర్ పృథ్వీషాపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 47 పరుగులు చేసి ఔటయ్యాడు.
అంతేకాదు ఢిల్లీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా ఆడిన కొన్ని షాట్‌లు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తలపిస్తున్నాయని సోషల్ మీడియాలో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 'స్ట్రేట్ డ్రైవ్ ఆడితే సచిన్‌లా.. కవర్ డ్రైవ్ ఆడితే కోహ్లిలా' ఉందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
'షా ఆడే షాట్స్‌ను కోహ్లీ ఆడటం కూడా చూడలేదు.. ఇక్కడ కోహ్లిని తక్కువ చేయడం నాఉద్దేశం కాదు. 90వ దశకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి షా బ్యాటింగ్ సచిన్‌ను గుర్తుచేస్తోంది' అని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు. 'ఈ మ్యాచ్ జరుగుతుంటే మా అమ్మ ఈ చిన్నపిల్లోడు ఎవరని.. షాను చూపిస్తూ అడిగింది. సచిన్‌లానే ఉన్నాడని చెప్పింది' అని మరొక అభిమాని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications