For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ రేంజ్‌లో హెలికాప్టర్ షాట్ బాదిన ఇషాన్ (వీడియో)

IPL 2018: Ishan Kishan Does An MS Dhoni, Hits Six With A Helicopter Shot

హైదరాబాద్: ఐపీఎల్‌లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బౌలర్లపై విరుచుకుపడిన ముంబై ఇండియన్స్‌ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ ఇన్నింగ్స్‌ మెరిసింది. జట్టు విజయం కంటే అతని ఆటతీరే అందరికీ చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ కొట్టిన ఓ షాట్‌ అద్భుతంగా అలరించింది. హెలికాప్టర్‌ షాట్‌. అంతేగాక ప్రముఖ మీడియా ఛానెళ్లన్నీ ఆ షాట్ అచ్చు మహేంద్రసింగ్ ధోనీ హెలికాప్టర్ షాట్‌ను పోలి ఉందంటూ కితాబులిస్తున్నారు.

టోర్నీలో భాగంగా బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14వ ఓవర్లో కుల్‌దీప్‌ యాదవ్‌ వేసిన ఓ బంతిని జార్థండ్ ఆటగాడైన ఇషాన్‌ సిక్స్‌గా మలిచాడు. ధోనీ హెలికాప్టర్‌ షాట్‌ ఎలా ఆడతాడో అచ్చు అలాగే ఇషాన్‌ ఈ సిక్స్‌ బాది చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

'ధోనీ సలహాలు ఇషాన్‌కు బాగా ఉపయోగపడ్డాయి; ధోనీలా హెలికాప్టర్‌ షాట్‌ కొట్టాడు' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగిన ఓ మ్యాచ్‌ అనంతరం ఇషాన్‌... ధోనీ వద్ద సలహాలు తీసుకుంటూ కనిపించిన సంగతి తెలిసిందే.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్‌ కేవలం 21 బంతుల్లోనే 62 పరుగులు చేసి ముంబయి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ముంబయి 102 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆడిన 11 మ్యాచుల్లో 5 విజయాలతో ముంబయి ఇండియన్స్‌ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

Story first published: Thursday, May 10, 2018, 11:10 [IST]
Other articles published on May 10, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+