Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2018: వేలంలో అమ్ముడుపోని బెస్ట్-11 విదేశీ ప్లేయర్లు వీరే

IPL 2018: Is this the Best Unsold Overseas XI?

హైదరాబాద్: ఐపీఎల్ 2018 వేలం ముగిసింది. కొందరు ఆటగాళ్లు అంచనాలకు మించి కోట్లు పలికారు. మరికొందరు అంచనాల్ని అందుకోలేక చతికిలపడ్డారు. కొందరు ఆటగాళ్లు అయితే గత ప్రాంఛైజీల నిరాదరణతో షాక్ తిన్నారు. ఈ జాబితా ఆటగాళ్లలో లసిత్ మలింగ ఒకడు.

వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా

ఐపీఎల్ 11వ సీజన్ కోసం నిర్వహించిన వేలం వల్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు లసిత్ మలింగ అవసరం లేదని స్పష్టమైంది. అందుకో కాబోలు వేలంలో రెండు సార్లు మలింగ పేరు వచ్చినప్పటికీ ప్రాంఛైజీలు కనీసం అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబర్చలేదు.

బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు జరిగిన వేలంలో లసిత్ మలింగను కొనుగోలు చేసేందుకు ఎనిమిది ప్రాంఛైజీల్లో ఏ ఒక్క ప్రాంఛైజీ కూడా ముందుకు రాలేదు. నిజానికి గత కొన్ని సంవత్సరాలుగా టీ20 క్రికెట్‌లో లసిత్ మలింగ జట్టుకు అదనపు బలంగా ఉండేవాడు.

2011లో జరిగిన ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు ఇచ్చే పర్పెల్ క్యాప్ అవార్డుని మలింగ సొంతం చేసుకున్నాడు. కానీ, ఈ మధ్య కాలంలో ఫిట్‌నెస్‌తో పాటు ఆట పరంగా మలింగ ప్రదర్శన మరీ తీసికట్టుగా తయారైంది. 34 ఏళ్ల మలింగతో పాటు పలువురు విదేశీ క్రికెటర్లు అమ్ముడుపోని ఆటగాళ్లుగా నిలిచారు.

ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఐపీఎల్ 2017లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరుపున సెంచరీలు నమోదు చేసిన షాన్ మార్ష్, ఇయాన్ మోర్గాన్, హషీం ఆమ్లాలను ఏ ఒక్కరూ కోనుగోలు చేయకపోవడం. ఇయాన్ మోర్గాన్ ఇంగ్లాండ్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.

అయినప్పటికీ, ఫ్రాంఛైజీలు అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. మరోవైపు ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్‌ కూడా అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో ఉన్నాడు. ఐపీఎల్ వేలానికి జో రూట్ రావడం ఇదే మొట్ట మొదటిసారి. ఐపీఎల్ 11వ సీజన్‌కు గాను వేలానికి మొత్తం 581 మందికి నిర్వాహకులు అనుమతిచ్చారు.

వీరిలో ప్రాంఛైజీలు 169 మందిని కోనుగోలు చేయగా మిగతా 412 మంది అమ్ముడుపోని జాబితాలో ఉన్నారు. వేలంలో ఖర్చు చేయదగ్గ గరిష్ట మొత్తం రూ.66 కోట్ల నుంచి రూ.80 కోట్లకు పెరిగినప్పటికీ, గత సీజన్లలో మాదిరి ప్రాంఛైజీలు ఆటగాళ్లపై ఖర్చు చేయలేదు.

దీంతో వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లలో 113 మంది భారత క్రికెటర్లు ఉండగా, 56 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. తొలి రోజు రూ.12.5 కోట్లు పలికిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌దే ఈసారి కూడా రికార్డు ధరగా ఉంది. ఇక, సౌరాష్ట్ర ఆటగాడు జయదేవ్ ఉనదఖ్త్ ఊహించని స్థాయిలో రూ.11.5 కోట్లతో అత్యధిక ధర పలికిన భారత ఆటగాడిగా నిలిచాడు.

వేలంలో అమ్ముడుపోని బెస్ట్-11 విదేశీ ప్లేయర్లు:
* షాన్ మార్ష్ (ఆస్ట్రేలియా)
* హాషిం ఆమ్లా (దక్షిణాఫ్రికా)
* రాస్ టేలర్ (న్యూజిలాండ్)
* జో రూట్ (ఇంగ్లాండ్)
* ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్) (కెప్టెన్)
* జానీ బేర్స్టో (ఇంగ్లండ్) (వికెట్ కీపర్)
జేమ్స్ ఫాల్క్నర్ (ఆస్ట్రేలియా)
* శామ్యూల్ బాద్రీ (వెస్ట్ ఇండీస్)
* డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా)
* టింయల్ మిల్స్ (ఇంగ్లాండ్)
* లసిత్ మలింగా (శ్రీలంక)

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 29, 2018, 15:50 [IST]
Other articles published on Jan 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+