
ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లాడిన ముంబై
ఈ సీజన్‌లో ఇప్పటివరకు ముంబై ఆరు మ్యాచ్‌లు ఆడింది. ఆరంభంలో మూడు వరుస ఓటముల తర్వాత బెంగళూరుపై విజయం సాధించింది. అయితే ఒక్క సన్‌రైజర్స్ (147/6)తో మినహా మిగతా అన్నింటిలోనూ (చెన్నైతో 165/4, ఢిల్లీతో 194/7, బెంగళూరుతో 213/6, రాజస్థాన్‌తో 167/7) భారీ స్కోర్లే చేసింది. అయినా సరే విజయం సాధించలేకపోయింది. డెత్ ఓవర్లలో బౌలర్ల వైఫల్యంతో చాలా దగ్గరగా వచ్చి మ్యాచ్‌లను చేజార్చుకున్నారు. లీగ్ దశలో ఈ జట్టుకు మరో 8 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో కనీసం ఏడింటిలో గెలిస్తే ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. లేదంటే కష్టమే. కాబట్టి ఇక నుంచి ముంబైకి ప్రతి మ్యాచ్ చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి.

ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు
ముంబై జట్టులో ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు కొదువలేదు. ఓపెనర్ల నుంచి మొదలుపెడితే.. 8వ నంబర్ బ్యాట్స్‌మన్ వరకూ అందరూ హిట్టర్లే. అయితే, ఈ సీజన్‌లో వీళ్లలో ఎవరూ ఇప్పటివరకు సత్తా చాటలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ స్థానాన్ని కుర్రాళ్లకు వదిలి మిడిలార్డర్‌లో వచ్చినప్పటికీ ముంబై విజయం సాధించడం లేదు. ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో అతని స్కోర్లు 15, 11, 18, 94, 0, 2. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఏకంగా గోల్డెన్ డక్‌తో చరిత్ర కూడా సృష్టించాడు.

రాణించని పాండ్యా బ్రదర్స్, పొలార్డ్
ఒకప్పుడు ముంబై విజయాలను ఒంటిచేత్తో మోసిన పాండ్యా బ్రదర్స్, పొలార్డ్ ఇప్పుడు ఆ స్థాయిలో రాణించలేకపోతున్నారు. మిడిలార్డర్‌లో వస్తున్న కృనాల్, హార్దిక్ భారీ హిట్టింగ్ చేయలేకపోతున్నారు. ఒక్క చెన్నైతో మ్యాచ్ మినహా మిగతా నాలుగింటిలో ఈ ఇద్దరు ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా రెండంకెల స్కోరు కూడా అందుకోలేకపోతున్నాడు. ఇక, పొలార్డ్ విషయానికి వస్తే ఈ సీజన్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ అవకాశం రాకపోయినా.. ఆ తర్వాతి ఐదు మ్యాచ్‌ల్లో అతను చేసిన స్కోర్లు 28, 0, 5, 21, 9. ఈ సీజన్‌లో పొలార్డ్ ప్రదర్శన మరీ తీసికట్టుగా తయారైంది.

బౌలర్లు చెత్తప్రదర్శన చేయడం వల్లనే ముంబై ఓటమి
ఈ సీజన్‌లో ఇప్పటివరకు ముంబై ఓడిన మ్యాచ్‌ల్లో 90 శాతం బౌలర్లు చెత్తప్రదర్శన చేయడం వల్లనే మూటగట్టుకుంది. బ్యాటింగ్ పరంగా భారీ స్కోర్లు చేసినా వాటిని కాపాడటంలో బౌలర్లు ఘోరంగా విఫలమవుతున్నారు. బుమ్రా (7), ముస్తాఫిజుర్ (6), మెక్లెన్‌గన్ (4), ప్రదీప్ సాంగ్వాన్, బెన్ కటింగ్, హార్దిక్ పాండ్యా ఇలా అందరూ టీ20 స్పెషలిస్ట్‌లే. కానీ వీళ్లలో ఒక్కరు కూడా మ్యాచ్‌ను గట్టెక్కించే ప్రదర్శన చేయలేకపోతున్నారు. రాజస్థాన్ మ్యాచ్‌లో ఓ అనామకుడికి పాండ్యా పరుగులివ్వడమే ఇందుకు నిదర్శనం. వికెట్లు తీస్తున్నప్పటికీ బుమ్రా, ముస్తాఫిజుర్ చివరి ఓవర్లలో నోబాల్స్ వేసి మ్యాచ్ విజయవాకాశాలను దూరం చేస్తున్నారు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు మయాంక్ మార్కండే (8), కృనాల్ (6), మెక్లీంగన్ వికెట్లు తీస్తున్నా.. పరుగులను నిరోధించలేకపోతున్నారు.


Click it and Unblock the Notifications












