For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్: ఐపీఎల్ 11వ సీజన్‌లో ఒకటే ఆరంభ వేడుక

By Nageshwara Rao
 IPL 2018 to have just one opening ceremony

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో ఒకటే ఆరంభ వేడుక నిర్వహించాలని నిర్వహకులు భావిస్తున్నారు. దీని కోసం ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించారు ఐపీఎల్ నిర్వాహకులు. గతేడాది అన్ని ఫ్రాంచైజీలు తమ తమ సొంత మైదానాల్లో ఆరంభ వేడుకలను నిర్వహించిన సంగతి తెలిసిందే.

గతేడాది ప్రతి జట్టు తన సొంత మైదానంలో మొదటి మ్యాచ్‌ జరగడానికి ముందు ఆరంభ వేడుకలు నిర్వహించాయి. అయితే ఈ ఏడాది అలా వద్దని ఒక ఆరంభ వేడుకనే అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్వహాకులు నిర్ణయం తీసుకున్నారు.

ఏప్రిల్ 7 నుంచి మే 27 వరకు ఐపీఎల్ 11వ సీజన్‌ను నిర్వహించనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 7న తొలి మ్యాచ్ ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరుగుతుండగా, ఫైనల్ మ్యాచ్‌కి అదే స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 6న ముంబైలో గతంలో ఎన్నడూ జరగని విధంగా ఆరంభ వేడుకను నిర్వహించనున్నట్లు ఐపీఎల్ నిర్వహాకులు తెలిపారు. ఇందుకోసం ఐపీఎల్ 11వ సీజన్‌ ఆరంభ వేడుకలను ఎలా నిర్వహించాలి. ఎంత బడ్జెట్‌ కేటాయించాలన్న దానిపై ఇప్పటికే నిర్వాహకులు ఓ అవగాహనకు వచ్చారు.

ఆరంభ వేడుకల కోసం బీసీసీఐ సుమారు రూ.50 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆరంభ వేడుకల్లో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పాప్‌ గాయనీ గాయకులతో ప్రత్యేక కార్యక్రమాలను కూడా రూపొందిస్తుందంట. కాగా ఐపీఎల్ 11వ సీజన్ ఏప్రిల్‌ 7న ప్రారంభమై మే 27తో ముగియనుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 24, 2018, 13:19 [IST]
Other articles published on Jan 24, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+