For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'మీరు ఏడవండి.. నేను నవ్వుతా', హాట్యాఫ్ గేల్

IPL 2018: Hats off to Chris Gayle, says SRH skipper Kane Williamson

హైదరాబాద్: ఐపీఎల్ 11లో భాగంగా మొహాలీ వేదికగా గురువారం హైదరాబాద్, పంజాబ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో గేల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటంతో అతన్ని వేలంలో ఎందుకు కొనుగోలు చేయలేదంటూ ఆర్సీబీని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయమై నెటిజన్లు తెగ మండిపడుతున్నారు. రాయల్ ఛాలెంజర్ బెంగుళూరును ఎందుకు కొనుగోలు చేయలేదంటూ.. ట్విట్టర్ వేదికగా చెలరేగిపోతున్నారు.

సిక్సర్ల వీరుడు ఆర్సీబీతోనే:

సిక్సర్ల వీరుడు ఆర్సీబీతోనే:

క్రిస్ గేల్.. విండీస్ సిక్సర్ల వీరుడు గతేడాది వరకు ఆర్సీబీతోనే ఉన్నాడు. కానీ అతన్ని బెంగళూరు టీమ్ రిటైన్ జాబితాలో ఉంచుకోలేదు. అంతేకాకుండా వేలంలోనూ కొనుగోలు చేయలేదు. పైగా వేలంలోనూ అతని పేరు వచ్చినప్పుడల్లా ఏమీ పట్టనట్లు ఆ టీమ్ వ్యవహరించింది.

 రెండు మ్యాచుల్లోనూ ఒంటిచేత్తో గేల్:

రెండు మ్యాచుల్లోనూ ఒంటిచేత్తో గేల్:

రెండో రోజుల వేలంలో పంజాబ్ జట్టు క్రిస్ గేల్‌ను పంజాబ్ ప్రారంభ ధరకే కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు గురువారం పంజాబ్, హైదరాబాద్ జట్ల పోరులో అద్భుతమైన ప్రదర్శన చూసి తెగ సంబరపడిపోతుంది. దీంతోపాటు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఆ టీమ్‌ను గేల్ ఒంటిచేత్తో గెలిపించాడు. ఓ మ్యాచ్‌లో 63, మరో మ్యాచ్‌లో 104 పరుగులు చేశాడు గేల్.

గేల్‌ను వదిలేసినందుకే ఆర్‌సీబీ:

గేల్‌ను వదిలేసినందుకే ఆర్‌సీబీ:

ఆరంభ మ్యాచ్ నుంచి కేవలం ఒకే విజయంతో ఉండి వరుస ఓటములతో కుంగిపోయి ఉన్న ఆర్సీబీని గేల్ ఇన్నింగ్స్ మరింత కుంగదీస్తున్నది. ఆర్సీబీ పుండుపై గేల్ మరింత కారం చల్లుతున్నాడని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. ఇలా మరికొందరు బెంగళూరు జట్టు మీద విమర్శలు గుప్పిస్తున్నారు.

పంజాబ్ టీమ్‌లో దంచేస్తున్నారు:

పంజాబ్ టీమ్‌లో దంచేస్తున్నారు:

'రాహుల్, గేల్‌లను ఆర్సీబీ వదులుకుంది.. వాళ్లు కింగ్స్ పంజాబ్ టీమ్‌లో దంచేస్తున్నారు.. సర్ఫరాజ్‌ను రిటైన్ చేసుకొని, మెకల్లమ్‌ను కొత్తగా తెచ్చుకున్నారు. కానీ వాళ్లిద్దరూ ఏమాత్రం రాణించడం లేదంటూ మరొకరు పంచ్ వేశారు.

 మీరు ఏడవండి.. నేను నవ్వుతా:

మీరు ఏడవండి.. నేను నవ్వుతా:

మీరు ఏడవండి.. నేను నవ్వుతా అని ఆర్సీబీతో గేల్ అంటున్నట్లుగా మరో ట్వీట్.. ఇలా గేల్‌ను ఎందుకు వదులుకున్నామా అని ఆర్సీబీ అనుకునేలా వరుస ట్వీట్లతో కోహ్లి టీమ్‌ను ఆడుకుంటున్నారు అభిమానులు.

 క్రిస్‌ గేల్‌కు హ్యాట్సాఫ్‌‌:

క్రిస్‌ గేల్‌కు హ్యాట్సాఫ్‌‌:

మ్యాచ్‌ అనంతరం కేన్‌ మాట్లాడుతూ..‘క్రిస్‌ గేల్‌కు హ్యాట్సాఫ్‌‌. చాలా బాగా ఆడాడు. అతను ఏం చేశాడో అందరికీ తెలుసు. అద్భుతమైన శతకం సాధించాడు. ఈ విజయానికి పంజాబ్‌ జట్టు పూర్తిగా అర్హమైనది. ఈ రోజు మేము మా అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాం. ఈ మ్యాచ్‌ నుంచి మేము చాలా నేర్చుకున్నాం. ముఖ్యంగా బౌలింగ్‌లో' అని విలియమ్సన్‌ అన్నాడు.

కష్టానికి ఇది ప్రతిఫలం:

కష్టానికి ఇది ప్రతిఫలం:

అనంతరం కింగ్స్ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్ రవిచంద్రన్‌ అశ్విన్‌ మాట్లాడుతూ..‘గేల్‌ ఇన్నింగ్స్‌ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చాలా కష్టం. అతని కష్టానికి ఇది ప్రతిఫలం. చాలా అందంగా బ్యాటింగ్‌ చేశాడు. పవర్‌ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాడు. అభిమానుల్ని గేల్‌ బాగా ఎంటర్‌టైన్‌ చేశాడు' అని చెప్పాడు.

Story first published: Friday, April 20, 2018, 16:57 [IST]
Other articles published on Apr 20, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+