Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కావాలనే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం మానేశా: పాండ్యా

IPL 2018: Hardik Pandya Reveals He Has Stopped Practising Batting

హైదరాబాద్: వరుస వైఫల్యాల నేపథ్యంలో జట్టులో బలాలు, లోపాలను విశ్లేషించుకుని రంగం సిద్ధం చేసుకుంది ముంబై జట్టు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లంతా గట్టి పట్టుదలతో కనిపించారు. ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ పూర్తిగా మానేశానని తెలిపాడు. కోల్‌కతా జట్టుతో ఆడిన మ్యాచ్‌లో కీలకాంశాలను ఈ విధంగా చర్చించాడు.

'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా

'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా

ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ ఆల్ రౌండర్ 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన పాండ్యా 19 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ లోనూ అదే స్థాయిలో 20బంతులకి 35పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

కొత్తగా ఏమి ప్రయత్నించ లేదు:

కొత్తగా ఏమి ప్రయత్నించ లేదు:

ఇంతటి విజయం సాధించిన తర్వాత మాట్లాడిన పాండ్యా ‘నేను కొత్తగా ఏమి ప్రయత్నించ లేదు. అది ఏదో ఒకరోజు వచ్చేదే. బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ కూడా మానేశా. నేను భిన్నంగా ఆలోచించే వ్యక్తిని. నిజానికి నేను సానుకూలంగా ఆడాను. ఒక్క సిక్స్‌ బాదితే మైదానంలో పరిస్థితి మొత్తం మారుతోంది. దిన్నే దృష్టిలో ఉంచుకునే హిట్టింగ్‌ చేశాను' అని పాండ్యా చెప్పుకొచ్చాడు.

14 వికెట్లతో పర్పుల్‌ క్యాప్‌

14 వికెట్లతో పర్పుల్‌ క్యాప్‌

కోల్‌కతాను 168 పరుగులకే కట్టడి చేయడంపై స్పందిస్తూ తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని, తాను కూడా సానుకూలంగా బౌలింగ్‌ చేశానని దీంతోనే వికెట్లు దక్కాయని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 19 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసిన పాండ్యా ఈ సీజన్‌లో 14 వికెట్లతో పర్పుల్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు. ఈ క్యాప్‌ కోసం మాత్రం ప్రయత్నించలేదని, క్యాప్‌ అందుకోవడం సంతోషంగా ఉందన్నాడు.

ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే:

ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే:

తమ జట్టు సానుకూల దృక్పథంతో ముందుకెళ్తుందని, టైటిల్‌ రేసులో నిలుస్తామని ఈ యువ ఆల్‌రౌండర్‌ ధీమా వ్యక్తం చేశాడు. 10 మ్యాచ్‌లు ఆడిన ముంబై నాలుగు మాత్రమే గెలిచింది. ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే ముంబై ప్రతీ మ్యాచ్‌ గెలువాల్సిందే.

Story first published: Tuesday, May 8, 2018, 9:13 [IST]
Other articles published on May 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+