For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'హార్థిక్ పాండ్యా తనంతట తానే బౌలర్‌గా మారాడు'

IPL 2018: Hardik Pandya Has Transformed Himself As A Bowler, Says Brother Krunal

హైదరాబాద్: ఐపీఎల్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా ముంబై, కోల్‌కతాల మధ్య జరిగిన పోరులో ముంబై జట్టు విజయం సాధించింది. క్లిష్టమైన పరిస్థితుల్లో గెలుపును అందుకోవడంతో ప్లేఆఫ్ నుంచి తప్పించుకోగలిగింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో తన బౌలింగ్, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టిన హార్ధిక్ పాండ్యాను ఈ మ్యాచ్‌కు గాను 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డుతో సత్కరించారు. మ్యాచ్ అనంతరం కృనాల్ పాండ్యా మాట్లాడుతూ.. కిందటేడాది చేసిన ప్రదర్శనకు ఇప్పటికీ హార్థిక్ పాండ్యాలో చాలా మెరుగైన ప్రదర్శన కనిపించింది. ఇది ఒక మంచి పరిణామం. తన ఆటతీరు మెరుగుపడడానికి హార్థిక్ స్వయంగా కృషి చేశాడు. ఇది చాలా సంతోషకరమైన విషయం' అని పేర్కొన్నాడు.

ముంబై జట్టు తరపున ఆడుతున్న పాండ్యా కోల్‌కతాకు బౌలింగ్‌తో కేవలం 19పరుగులిచ్చి 2వికెట్లు తీశాడు. దీంతో మొత్తం 9 మ్యాచ్‌లలో కలిపి 14వికెట్ల వరకూ తీయగలిగాడు. అంతే స్థాయిలో అతని సోదరుడు కృనాల్ పాండ్యా కూడా 9 వికెట్లు తీసి ఐపీఎల్ మొత్తంలో వికెట్లు తీసిన వారి జాబితాలో 12వ స్థానంలో ఉన్నాడు.

ఈ సందర్భంగా కృనాల్ పాండ్యా మాట్లాడుతూ.. ఇంతకుముందు ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ బౌలింగ్ వేస్తానని కెప్టెన్ రోహిత్‌ను ఆడిగా. అందుకుగాను కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్ వేసేందుకు నాకు అవకాశమిచ్చాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో కోల్‌కతాకు 23 పరుగులు రావాల్సి ఉండగా కృనాల్ తన బౌలింగ్ మాయాజాలంతో కట్టడి చేసి కేవలం 10పరుగులు మాత్రమే తీయగలిగేలా చేశాడు.

తన జట్టు ముంబై ఇండియన్స్‌ను పొగుడుతూ.. ప్రతి మ్యాచ్ లోనూ తమ ఆటగాళ్లు పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తూనే వస్తున్నారని పేర్కొన్నాడు. ఒక్కో మ్యాచ్‌కు జట్టులోని ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకే కష్టపడుతున్నారంటూ తెలిపాడు. ముంబై జట్టు తర్వాతి మ్యాచ్ కూడా కోల్‌కతాతోనే ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం తలపడనుంది.

Story first published: Monday, May 7, 2018, 14:03 [IST]
Other articles published on May 7, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+