Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇప్పటికీ నమ్మలేకపోతున్నా: గౌతమ్‌ కృష్ణప్ప ఇన్నింగ్స్‌పై రహానే

IPL 2018: Gowthams Knock Was Unbelievable, Says Rahane

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజ్యింకె రహానే మట్లాడుతూ 'ఏం జరిగిందో ఇప్పటికీ నమ్మలేకపోతున్నా' అని అన్నాడు.

రాజస్థాన్ విజయంలో గౌతమ్‌ కృష్ణప్ప దూకుడు ఇన్నింగ్స్‌కు తోడు బౌలర్ల సంయమనం కూడా ఉందని అన్నాడు. 'ముంబై టీమ్‌ 180-190 పరుగులు చేస్తుందనుకున్నా. కానీ మిడిల్‌, స్లాగ్‌ ఓవర్లలో మా వాళ్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. అసలు ఎలా గెలిచామో, ఏం జరిగిందో ఇప్పటికీ నమ్మలేకపోతున్నా' అని రహానే తెలిపాడు.

11 బంతుల్లో 33 పరుగులు చేసిన గౌతమ్‌ కృష్ణప్ప

11 బంతుల్లో 33 పరుగులు చేసిన గౌతమ్‌ కృష్ణప్ప

ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గౌతమ్‌ కృష్ణప్ప 11 బంతుల్లో 2 సిక్సులు, 4 ఫోర్ల సాయంతో 33 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం గౌతమ్‌ కృష్ణప్ప మాట్లాడుూ ‘జస్ట్‌ బిలీవ్‌ దట్‌ యు కెన్‌' అన్న కెప్టెన్‌ రహానే మాటలే తనకు బలమిచ్చాయని, కనీసం ఆఖరి బంతికైనా ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతోనే ఆడానని చెప్పాడు. గతేడాది ముంబై ఇండియన్స్‌కు(రూ.2కోట్లు) ఆడిన గౌతమ్‌ కృష్ణప్పను ఈ ఏడాది రాజస్థాన్ రూ. 6.2 కోట్లకు వేలంలో సొంతం చేసుకుంది.

ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకున్న సంజూ శాంసన్

ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకున్న సంజూ శాంసన్

కాగా, రాజస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించిన మరో ఆటగాడు సంజూ శాంసన్‌ 239 పరుగులు సాధించడంతో ‘ఆరెంజ్‌ క్యాప్‌' దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా సంజూ శాంసన్ మాట్లాడుతూ 'మ్యాచ్‌లో ఎన్ని పరుగులు చేశామన్నది లెక్కకాదు. జట్టును గెలిపించామా లేదా అన్నదే కీలకం. నేను ఆరెంజ్‌ క్యాప్‌ తీసుకొని.. మా జట్టు ఓడిపోయి ఉంటే అస్సలు సంతోషించేవాడిని కాదు. థ్యాంక్స్‌ టు కృష్ణప్ప గౌతమ్‌' అని పేర్కొన్నాడు.

ముంబైపై రాజస్థాన్ 3 వికెట్ల తేడాతో ఘన విజయం

ముంబైపై రాజస్థాన్ 3 వికెట్ల తేడాతో ఘన విజయం

కాగా, చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సంజూ శాంసన్‌(52), బెన్‌స్టోక్స్‌ (40), కృష్ణప్ప గౌతమ్‌(33) రాజస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ముంబై బౌలర్లు పాండ్యా, బుమ్రాలు చెరో రెండు వికెట్లు తీశారు.

జోఫ్రా ఆర్చర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు

జోఫ్రా ఆర్చర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(72), ఇషాన్‌ కిషన్‌ (58), పొలార్డ్‌(21)లు రాణించారు. అనంతరం 168 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న జోఫ్రా ఆర్చర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Story first published: Monday, April 23, 2018, 15:00 [IST]
Other articles published on Apr 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+