Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చివరికి ఆ టార్గెట్‌ను కూడా ఛేదించలేకపోయాం: గౌతం గంభీర్

IPL 2018: Gautam Gambhir slams Delhi Daredevils batsmen as they fail to chase down 143

హైదరాబాద్: సొంత మైదానంలో చాలా తక్కువ లక్ష్యాన్ని సైతం ఛేదించలేక ఓటమి పాలైంది. ఈ విషయంపై ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ ఇలా స్పందించాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో సోమవారం రాత్రి జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో తమ జట్టు ఓడిపోవడం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. స్వల్ప స్కోరు ఛేదించడంలో తమ బ్యాట్స్‌మన్‌ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డాడు. 144 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కూడా అందుకోలేక డేర్‌ డెవిల్స్‌ 4 పరుగుల తేడాతో ఓడింది.

మ్యాచ్‌ ముగిసిన తర్వాత గంభీర్‌ మాట్లాడుతూ... 'మొదటి ఆరు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోవడం కొంప ముంచింది. మేము త్వరగా వికెట్లు కోల్పోవడంతో ప్రత్యర్థికి మ్యాచ్‌పై పట్టు చిక్కింది. పరుగులు బాగానే చేసినప్పటికీ ఎక్కువ వికెట్లు నష్టపోయాం. మా బౌలర్లు ప్రత్యర్థి టీమ్‌ను తక్కువ పరుగులకే నియంత్రించారు. కానీ మేము త్వరగా వికెట్లను కోల్పోవడంతో గెలుపు అవకాశాలు సన్నగిల్లాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయాన్ని అందుకోవడం చాలా కష్టంగా మారిందని అన్నాడు.

సానుకూల అంశాల గురించి చెబుతూ.. టాప్‌ స్కోరర్‌ శ్రేయస్‌ అయ్యర్‌(57)తో పాటు యువ ఆటగాళ్లు పృథ్వీ షా, అవిశ్‌ ఖాన్‌ రాణించడం శుభపరిణామమని గౌతమ్‌ గంభీర్‌ పేర్కొన్నాడు. 'అయ్యర్‌ బాగా ఆడాడు. అవిశ్‌ కూడా బాగా బౌలింగ్‌ చేశాడు. పృథ్వీ షాకు మంచి భవిష్యత్తు ఉంద'ని అన్నాడు. పృథ్వీ షా 10 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేశాడు. అవిశ్‌ 4 ఓవర్లలో 36 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

ముందున్న టోర్నీగురించి మాట్లాడుతూ.. ఇంకా ఎనిమిది మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కనీసం ఏడింటిలోనైనా గెలిచి చూపిస్తాం. మా తరపు నుంచి ఇంకా మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఈ మ్యాచ్‌లో బౌలర్లు బాగా రాణించారు. కానీ, బ్యాట్స్‌మెన్ అంతగా ఆకట్టుకోలేకపోయారు. అందుకే ఓటమికి గురి కావల్సి వచ్చింది. ఇలాంటి పొరబాటు పునరావృతం కాకుండా చూసుకుంటాం.' అని అభిప్రాయపడ్డాడు.

Story first published: Tuesday, April 24, 2018, 11:01 [IST]
Other articles published on Apr 24, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+