Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2018: వేలం తర్వాత రాజస్థాన్ రాయల్స్ పూర్తి జట్టు ఇదే

IPL 2018: Full list of Rajasthan Royals (RR) squad after the auction

హైదరాబాద్: ఐపీఎల్ వేలం ముగిసింది. బెంగళూరు వేదికగా రెండో రోజుల పాటు జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 22 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. గత సీజన్లతో పోలిస్తే ఐపీఎల్ 11వ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు అటు విదేశీ, ఇటు లోకల్ ప్లేయర్ల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది.

ఈసారి జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌కు అత్యధికంగా రూ. 12.5 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. ఇక, వేలంలో సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనదఖ్త్ కోసం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లతో పోటీ పడి చివరకు రూ. 11.5 కోట్లు చెల్లించి దక్కించుకుంది.

వీరితో పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన మాజీ ఆటగాళ్లు అయిన అజ్యింకే రహానే, సంజూ శాంసన్, స్టువర్ట్ బిన్నీ, ధావల్ కులకర్ణలను కూడా వేలంలో సొంతం చేసుకుంది. ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయని వెస్టిండిస్ అల్ రౌండర్ జోఫ్రా ఆర్చర్, కర్ణాటక ఆల్ రౌండర్ గౌతమ్ క్రిష్టప్పలకు భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది.

ఈసారి వేలంలో రాజస్థాన్ రాయల్స్ కొన్ని అనూహ్యమైన నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యంగా ఆప్గనిస్తాన్ చైనామన్ బౌలర్ జహీర్ ఖాన్ ఫఖ్తీన్‌ను రూ. 60 లక్షలకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.


మొత్తం జట్టు సభ్యులు - 23; బ్యాట్స్‌మెన్ - 3; బౌలర్లు - 6; వికెట్ కీపర్లు - 2; ఆల్ రౌండర్లు - 11; విదేశీ ఆటగాళ్లు - 8

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు - 1; వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు - 22

అత్యధిక ధర చెల్లించిన ఆటగాడు - స్టీవ్ స్మిత్ (రూ. 12.5 కోట్లు).

వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడు - బెన్ స్టోక్స్ - రూ. 12.5 కోట్లు

ఖర్చు చేసిన డబ్బు - రూ. 78.35 కోట్లు

మిగిలిన డబ్బు - రూ. 1.65 కోట్లు


రాజస్థాన్ రాయల్స్
1. స్టీవ్ స్మిత్ (రూ.12 కోట్లు-Retained)
2. బెన్ స్టోక్స్ (రూ.12.5 కోట్లు)
3. రహానే (రూ.4 కోట్లు-RTM)
4. స్టువర్ట్ బిన్నీ (రూ.50 లక్షలు)
5. సంజు శాంసన్ (రూ.8 కోట్లు)
6. జోస్ బట్లర్ (రూ.4.4 కోట్లు)
7. రాహుల్ త్రిపాఠి (రూ.3.4 కోట్లు)
8. డార్సీ షార్ట్ (రూ.4 కోట్లు)
9. జోఫ్రా ఆర్చర్ (రూ.7.2 కోట్లు)
10. గౌతమ్ క్రిష్ణప్ప (రూ.6.2 కోట్లు)
11. ధవల్ కులకర్ణి (రూ.75 లక్షలు-RTM)
12. జయదేవ్ ఉనద్కట్ (రూ.11.5 కోట్లు)
13. అంకిత్ శర్మ (రూ.20 లక్షలు)
14. అనురీత్ సింగ్ (రూ.30 లక్షలు)
15. జహీర్ ఖాన్ పక్టీన్ (రూ.60 లక్షలు)
16. శ్రేయాస్ గోపాల్ (రూ.20 లక్షలు)
17. ప్ర‌శాంత్ చోప్రా (రూ.20 ల‌క్ష‌లు)
18. మ‌హిపాల్ లామ్‌రోర్ (రూ.20 ల‌క్ష‌లు)
19. జ‌తిన్ స‌క్సేనా (రూ.20 ల‌క్ష‌లు)
20. ఆర్య‌మాన్ విక్ర‌మ్ బిర్లా (రూ.30 ల‌క్ష‌లు)
21. దుష్మంత చ‌మీరా (రూ.50 ల‌క్ష‌లు)
22. మిథున్ ఎస్ (రూ.20 ల‌క్ష‌లు)

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 29, 2018, 16:46 [IST]
Other articles published on Jan 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+