న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మొత్తం ఐపీఎల్ 2018 క్రికెటర్లు సాధించిన అవార్డులు, రివార్డులు

IPL 2018: Full list of prize winners including Orange Cap and Purple Cap

హైదరాబాద్: వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ తుది సమరంలో చెన్నై జట్టు గెలుపొందింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. సీజన్ ఆరంభం నుంచి బౌలింగే ప్రధాన బలంగా విజయాలను సొంతం చేసుకున్న రైజర్స్ ఈ మ్యాచ్‌లో తేలిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా 2 ఓవర్లు ఉండగానే మ్యాచ్ దాదాపు చెన్నై చేతికి అప్పజెప్పేశారు. వాట్సన్ దూకుడుకు బెంబేలెత్తేసిన బౌలర్లు ఓటమిని ముందుగానే అంగీకరించారు.

అయితే ఈ మ్యాచ్ అనంతరం ఐపీఎల్ ట్రోఫీని అందుకున్న ధోనీ మాట్లాడుతూ.. 'అందరూ నమ్మినట్లే సెంటిమెంట్లను నమ్ముతాను కానీ, దాంతో పాటుగా జట్టు ప్రదర్శన కూడా కీలకమే కదా' అని తెలిపాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం ఈ లీగ్ మొత్తంలో క్రికెటర్లు సాధించిన రివార్డులు, అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తమ మైదానం: ఈడెన్‌ గార్డెన్స్, కోల్‌కతా (రూ. 50 లక్షలు)

ఆరెంజ్‌ క్యాప్‌- విలియమ్సన్‌ (రూ.10 లక్షలు)

ఆరెంజ్‌ క్యాప్‌- విలియమ్సన్‌ (రూ.10 లక్షలు)

సీజన్ మరి కొద్ది రోజుల్లో మొదలైపోతుందనగా డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా రద్దు చేస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దాంతో హైదరాబాద్ జట్టుతో పాటు అభిమానులు కూడా జట్టు పరిస్థితి గురించి ఆందోళనకు గురైయ్యారు. అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్సీ బాధ్యతలు భుజానికేసుకున్న విలియమ్‌సన్ రైజర్స్‌ను 18 పాయింట్లతో ఫైనల్ వరకు తీసుకొచ్చాడు. అది కూడా మిడిల్ ఓవర్లలో లో డాట్ బాల్ పర్సంటైజ్ కొనసాగిస్తూ నడిపించాడు. అయితే ఈ లీగ్ కు సంబంధించి కేన్ వ్యక్తిగత స్కోరు 735 పరుగులు. ఈ సీజన్‌కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, ఐపీఎల్‌ మొత్తంలో విరాట్ కోహ్లీ (973), వార్నర్ (848) అతనికంటే ముందున్నారు.

పర్పుల్‌ క్యాప్‌- ఆండ్రూ టై (రూ. 10 లక్షలు)

పర్పుల్‌ క్యాప్‌- ఆండ్రూ టై (రూ. 10 లక్షలు)

లీగ్ ఆరంభమైయ్యాక కుటుంబంలో విషాదం చోటు చేసుకున్నా.. ఏకాగ్రత చలించకుండా ఆడి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నమోదయ్యాడు. హార్ధిక్ పాండ్యాతో పాటు మరికొందరు చేతులు మారినా చివరికి ఆండ్రూ టైకే దక్కింది పర్పుల్ క్యాప్.

పర్‌ఫెక్ట్‌ క్యాచ్‌ ఆఫ్‌ ద సీజన్‌-ట్రెంట్‌ బౌల్ట్‌ (రూ. 10 లక్షలు)

పర్‌ఫెక్ట్‌ క్యాచ్‌ ఆఫ్‌ ద సీజన్‌-ట్రెంట్‌ బౌల్ట్‌ (రూ. 10 లక్షలు)

న్యూజిలాండ్ ఫేసర్ బ్రిలియంట్ క్యాచ్ అందుకుని ఐపీఎల్ 11 మొత్తానికే పర్‌ఫెక్ట్ క్యాచ్ అందుకున్న వ్యక్తిగా నిలిచాడు. విరాట్ కోహ్లీ కొట్టిన షాట్‌ను బౌండరీ రోప్ దగ్గర నిల్చొని పట్టుకొని ఇంకాస్తలో ఫోర్ బౌండరీ లైన్ ముందు ఆగిపోయాడు.

ఎమర్జింగ్‌ ప్లేయర్‌-రిషభ్‌ పంత్‌ (రూ. 10 లక్షలు)

ఎమర్జింగ్‌ ప్లేయర్‌-రిషభ్‌ పంత్‌ (రూ. 10 లక్షలు)

ఢిల్లీ డేర్‌డెవిల్స్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్‌గా బరిలోకి దిగిన పంత్ అద్భుతమైన ప్రదర్శన చేసి ఎమర్జింగ్ ప్లేయర్‌గా నిలిచాడు. ఆడిన 14 మ్యాచ్‌లలో 173.60స్ట్రైక్ రేట్‌తో 684 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు.

మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌-సునీల్‌ నరైన్‌ (రూ. 10 లక్షలు)

మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌-సునీల్‌ నరైన్‌ (రూ. 10 లక్షలు)

సునీల్ నరైన్ ఈ సీజన్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శన చేసి సీజన్ మొత్తానికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా నిలిచాడు. బ్యాటింగ్‌లో 357 పరుగులు చేసి, బౌలింగ్‌లో 17 వికెట్లు తీశాడు.

సూపర్‌ స్ట్రయికర్‌-సునీల్‌ నరైన్‌

సూపర్‌ స్ట్రయికర్‌-సునీల్‌ నరైన్‌

కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన వెస్టిండీస్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ సీజన్‌కు గాను సూపర్ స్ట్రయికర్ అవార్డు అందుకున్నాడు. 16 మ్యాచ్‌లు ఆడి 357 పరుగులను చేశాడు.

స్టయిలిష్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌-రిషభ్‌ పంత్‌ (రూ. 10 లక్షలు):

స్టయిలిష్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌-రిషభ్‌ పంత్‌ (రూ. 10 లక్షలు):

రిషబ్ పంత్‌కు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుతో పాటు స్టయిలిష్ ప్లేయర్ అవార్డు కూడా వరించింది. ఈ సీజన్ మొత్తంలో ఇన్నోవేటివ్ షాట్స్‌ను ప్రయోగించి ఐపీఎల్ అభిమానులను అలరించాడు.

నయీ సోచ్‌ సీజన్‌ అవార్డు-ధోని (రూ. 10 లక్షలు)

నయీ సోచ్‌ సీజన్‌ అవార్డు-ధోని (రూ. 10 లక్షలు)

చెన్నై కెప్టెన్ కూల్‌కు నయీ సోచ్ అవార్డు బహుకరించారు. కొత్త ఆలోచనలతో జట్టును చక్కగా వాడుకుని ట్రోఫీని గెలిచి విమర్శకుల నోర్లు మూయించాడు. ఈ అవార్డుకు మ్యాచ్ కామెంటేటర్లే ధోనీకి ఓటేశారు.

ఫెయిర్‌ ప్లే అవార్డు: ముంబై ఇండియన్స్‌

ఫెయిర్‌ ప్లే అవార్డు: ముంబై ఇండియన్స్‌

గతేడాది విజయం సీజన్ ఆరంభంలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ లీగ్ దశకే పరిమితమైంది. ప్రథమార్థంలో తడబడినా తర్వాతి భాగంలో అదిరిపోయే ప్రదర్శన ఇచ్చి అంపైర్లు మనసు దోచుకున్నారు. అంతేకాకుండా మైదానంలో ఆ జట్టు ప్రవర్తించిన తీరున పరిగణనలోకి తీసుకున్న అంపైర్లు ఈ అవార్డుకు నామినేట్ చేశారు.

వారు పరిశీలించిన అంశాలు:

ఆడుతున్నంత సేపు పోరాట పటిమ కలిగి ఉండటం.

ప్రత్యర్థి జట్టు పట్ల గౌరవ మర్యాదలు పాటించడం.

మ్యాచ్ నియమాలను పాటించటం.

అంపైర్లకు మర్యాదనివ్వడం.

రన్నరప్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (రూ. 12 కోట్ల 50 లక్షలు)

రన్నరప్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (రూ. 12 కోట్ల 50 లక్షలు)

తొలి సారిగా ఫైనల్స్ దాకా వచ్చి ఓడిపోయిన హైదరాబాద్‌కు రూ.12.5 కోట్లు అందజేశారు.

గతంలో లీగ్‌లో రన్నరప్‌గా మిగిలిన వారు:

2008 - Chennai Super Kings (CSK)

2009 - Royal Challengers Bangalore (RCB)

2010 - Mumbai Indians (MI)

2011 - RCB

2012 - CSK

2013 - CSK

2014 - Kings XI Punjab (KXIP)

2015 - CSK

2016 - RCB

2017 - Rising Pune Supergiant

విన్నర్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ (రూ. 20 కోట్లు)

విన్నర్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ (రూ. 20 కోట్లు)

ఈ విజయంతో ఐపీఎల్‌లో మూడో ట్రోఫీని అందుకున్న చెన్నై రూ. 20కోట్లు అందుకుంది. రెండేళ్ల నిషేదం అనంతరం బరిలోకి రావడంతో ఆ జట్టు పునరాగమనం విజయవంతంగా నమోదు చేసింది.

గత లీగ్‌ల విన్నర్లు:

2008 - Rajasthan Royals (RR)

2009 - Deccan Chargers (DC)

2010 - Chennai Super Kings (CSK)

2011 - CSK

2012 - Kolkata Knight Riders (KKR)

2013 - Mumbai Indians (MI)

2014 - KKR

2015 - MI

2016 - Sunrisers Hyderabad (SRH)

2017 - MI

Story first published: Monday, May 28, 2018, 12:31 [IST]
Other articles published on May 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X