Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2018: వేలం తర్వాత ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు ఇదే

IPL 2018: Full list of Mumbai Indians squad after auction

హైదరాబాద్: ఐపీఎల్ 2018 వేలం ముగిసింది. బెంగళూరు వేదికగా శని, ఆది వారాల్లో నిర్వహించిన వేలంలో ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఈ వేలంలో ముంబై ఇండియన్స్ జట్టు 22 మంది ఆటగాళ్లను సొంతం చేసుకుంది. వేలానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలను అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే.

వేలంలో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టు రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా కృనాల్ పాండ్యాను అత్యధికంగా రూ. 8.8 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక, అందరూ ఊహించనట్టుగానే కీరన్ పొలార్డ్‌ను కూడా ముంబై ఇండియన్స్ వేలంలో సొంతం చేసుకుంది. వీరితో పాటు వెస్టిండిస్ ఓపెనర్ ఎవిన్ లూయిస్, సఫారీ మాజీ ఆల్ రౌండర్ జెపీ డుమినిలను కోనుగోలు చేసింది.

ఇక, ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, సౌరాష్ట్రకు చెందిన తివారీలను కూడా వేలంలో దక్కించుకుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా పేసర్లు ప్యాట్ కమ్మిన్స్, జాసన్‌లతో పాటు బంగ్లాదేశ్ లెప్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌, ప్రదీప్ సాంగ్వాన్‌లను కొనుగోలు చేసింది.


మొత్తం జట్టు సభ్యులు - 25; బ్యాట్స్‌మెన్ - 7; బౌలర్లు - 9; వికెట్ కీపర్లు - 2; ఆల్ రౌండర్లు - 7; విదేశీ ఆటగాళ్లు - 8

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు - 3; వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు - 22

అత్యధిక ధర చెల్లించిన ఆటగాడు - రోహిత్ శర్మ (రూ. 15 కోట్లు).

వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడు - కృనాల్ పాండ్యా - రూ. 8.8 కోట్లు

ఖర్చు చేసిన డబ్బు- రూ. 79.35 కోట్లు. మిగిలిన డబ్బు - రూ. 65 లక్షలు


ముంబై ఇండియన్స్
1. రోహిత్‌శర్మ (రూ.15 కోట్లు-Retained)
2. హార్దిక్ పాండ్యా (రూ.11 కోట్లు-Retained)
3. జస్‌ప్రీత్ బుమ్రా (రూ.7 కోట్లు-Retained)
4. కీరన్ పొలార్డ్ (రూ.5.4 కోట్లు-ఆర్టీఎమ్)
5. ముస్తఫిజుర్ రెహమాన్ (రూ.2.2 కోట్లు)
6. పాట్ కమిన్స్ (రూ.5.4 కోట్లు)
7. సూర్యకుమార్ జాదవ్ (రూ.3.2 కోట్లు)
8. కృనాల్ పాండ్యా (రూ.8.8 కోట్లు- RTM)
9. ఇషాన్ కిషన్ (రూ.6.2 కోట్లు)
10. రాహుల్ చహర్ (రూ.1.9 కోట్లు)
11. ఎవిన్ లూయిస్ (రూ.3.8 కోట్లు)
12. సౌరభ్ తివారీ (రూ.80 లక్షలు)
13. బెన్ కటింగ్ (రూ.2.2 కోట్లు)
14. ప్రదీప్ సాంగ్వాన్ (రూ.1.5 కోట్లు)
15. డుమిని (రూ.కోటి)
16. జేసన్ బెహ్రండార్ఫ్ (రూ.1.5 కోట్లు)
17. తజిందర్ ఢిల్లాన్ (రూ.55 లక్షలు)
18. శ‌ర‌ద్ లంబా (రూ.20 ల‌క్ష‌లు)
19. సిద్దేశ్ లాడ్ (రూ.20 ల‌క్ష‌లు)
20. ఆదిత్య తారె (రూ.20 ల‌క్ష‌లు)
21. మ‌యాంక్ మార్ఖాండె (రూ.20 ల‌క్ష‌లు)
22. అఖిల్ ధ‌నంజ‌య (రూ.50 ల‌క్ష‌లు)
23. అనుకుల్ రాయ్ (రూ.20 ల‌క్ష‌లు)
24. మోహిసిన్ ఖాన్ (రూ.20 ల‌క్ష‌లు)
25. నిదీష్ ఎండీ దినేష‌న్ (రూ.20 ల‌క్ష‌లు)

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 29, 2018, 16:31 [IST]
Other articles published on Jan 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+