Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2018: వేలం తర్వాత గంభీర్ లేని కోల్‌కతా జట్టు ఇదే, కెప్టెన్ ఎవరో?

 IPL 2018: Full list of Kolkata Knight Riders (KKR) squad after the auction

హైదరాబాద్: ఐపీఎల్ వేలం ముగిసింది. గత సీజన్లలో మాదిరి కాకుండా ఈసారి ఆటగాళ్ల కొనుగోలు విషయంలో ప్రాంఛైజీలు ఆచితూచి వ్యవహరించాయి. ఐపీఎల్ 11వ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కేవలం 19 మంది ఆటగాళ్లనే కొనుగోలు చేయడం విశేషం.

బెంగళూరు వేదికగా జరిగిన రెండు రోజుల వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 17 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వేలంలో కోల్‌‌కతా నైట్ రైడర్స్ దక్కించుకున్న ఖరీదైన ఆటగాడిగా క్రిస్ లిన్(రూ. 9.6 కోట్లు) నిలిచాడు. ఐపీఎల్ వేలానికి ముందు కోల్‌కతా సునీల్ నరేన్, ఆండ్రూ రస్సెల్‌ను అట్టిపెట్టుకుంది.

సునీల్ నరేన్‌కు రూ. 12.5 కోట్లు చెల్లించగా, ఆండ్రూ రస్సెల్‌కు రూ. 8.5 కోట్లు చెల్లించింది. కాగా, 2011 నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న గౌతం గంభీర్‌ను ఈసారి వేలంలో ఉంచింది. గంభీర్ నేతృత్వంలోని కోల్‌కతా జట్టు రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది.

అయితే, ఈసారి వేలంలో గంభీర్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు రూ. 2.8 కోట్లకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 11వ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్‌గా ఎవరు ఎంపిక అవుతారనే ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో నెలకొంది.

మొత్తం జట్టు సభ్యులు - 19; బ్యాట్స్‌మెన్ - 5; బౌలర్లు - 6; వికెట్ కీపర్లు - 2; ఆల్ రౌండర్లు - 6; విదేశీ ఆటగాళ్లు - 7

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు - 2; వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు - 17

అత్యధిక ధర చెల్లించిన ఆటగాడు - సునీల్ నరేన్ (రూ 12.5 కోట్లు).

వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడు - క్రిస్ లిన్ - రూ. 9.6కోట్లు

ఖర్చు చేసిన డబ్బు - రూ 80 కోట్లు

మిగిలిన డబ్బు - 0

వేలం తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు:

కోల్‌కతా నైట్ రైడర్స్
1. సునీల్ నరైన్ (రూ.8.5 కోట్లు - Retained)
2. అండ్రీ రసెల్ (రూ.7 కోట్లు-Retained)
3. మిచెల్ స్టార్క్ (9.4 కోట్లు)
4. క్రిస్ లిన్ (9.6 కోట్లు)
5. దినేష్ కార్తీక్ (రూ.7.4 కోట్లు)
6. రాబిన్ ఉతప్ప (రూ.6.4 కోట్లు-RTM)
7. పియూష్ చావ్లా (రూ.4.2 కోట్లు-RTM)
8. కుల్‌దీప్ యాదవ్ (రూ.5.8 కోట్లు -RTM)
9. శుభ్‌మాన్ గిల్ (రూ.1.8 కోట్లు)
10. ఇషాంక్ జగ్గి (రూ.20 లక్షలు)
11. నితీష్ రాణా (రూ.3.4 కోట్లు)
12. కమలేష్ నగర్‌కోటి (రూ.3.2 కోట్లు)
13. వినయ్ కుమార్ (రూ.కోటి)
14. అపూర్వ్ వాంఖెడె (రూ.20 లక్షలు)
15. రింకు సింగ్ (రూ.80 లక్షలు)
16.శివమ్ మావి (రూ.3 కోట్లు)
17. కేమరూన్ డెల్‌పోర్ట్ (రూ.30 లక్షలు)
18. మిచెల్ జాన్స‌న్ (రూ.2 కోట్లు)
19. జేవ‌న్ సియ‌ర్‌లెస్ (రూ.30 ల‌క్ష‌లు)

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 29, 2018, 18:34 [IST]
Other articles published on Jan 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+