Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2018: ప్రీతి జింతా షాపింగ్‌లో కొనుగోలు చేసిన పంజాబ్ జట్టు ఇదే

IPL 2018: Full list of Kings XI Punjab (KXIP) squad after the auction

హైదరాబాద్: ఐపీఎల్ వేలంలో క్రికెటర్ల కొనుగోలు నిమిత్తం అత్యధికంగా ఖర్చు పెట్టిన ఫ్రాంచైజీల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఒకటి. ప్రీతి జింతా సహ యజమానురాలిగా వ్యవహరిస్తోన్న జట్టు స్థానిక ఆటగాళ్లతో పాటు అక్సర్ పటేల్‌ను కూడా రిటైన్ చేసుకుంది. పంజాబ్ జట్టు ఈ ఐపీఎల్ పదకొండో సీజన్‌కు ఖరీదైన జట్టుగా నిలిచింది.

ఈ జట్టుకు మరో కొసమెరుపు వెస్టిండీస్ ఆటగాడైన క్రిస్ గేల్ వేలం చివరిలో కొనుగోలు కావడమే. రెండు రోజుల భాగంగా జరిగిన వేలంలో రెండు రౌండ్లలో అతనిని ఏ జట్టు కాదని చివరి రౌండ్లో అతను ప్రారంభ ధరగా ప్రకటించిన రూ.2 కోట్లకే అమ్ముడుపోయాడు. సిక్సర్ల వీరుడు, ప్రపంచ కప్ విన్నింగ్ జట్టులో ఒకడైన యువరాజ్ సింగ్ సైతం ప్రారంభ ధర రూ.2కోట్లకే అమ్ముడుపోయాడు.

జట్టులో మొత్తం ఆటగాళ్లు: 21
బ్యాట్స్‌మెన్స్: 7
బౌలర్లు: 7
ఆల్ రౌండర్లు: 6
వీళ్లలో విదేశీ ఆటగాళ్లు: 7
రిటైన్ట్ జాబితాలో (అట్టి పెట్టుకున్న) ఆటగాళ్లు: 1
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: 20
జట్టులో ఖరీదైన ఆటగాళ్లు: అక్సర్ పటేల్, కేఎల్ రాహుల్
మొత్తం ఫ్రాంచైజీ పెట్టిన ఖర్చు: రూ.79.9 కోట్లు
మిగిలిన సొమ్ము: రూ. 10లక్షలు

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు:
1. అక్షర్ పటేల్ (రూ.6.75 కోట్లు - Retained)
2. అశ్విన్ (రూ.7.6 కోట్లు)
3. యువరాజ్ సింగ్ (రూ.2 కోట్లు)
4. కరుణ్ నాయర్ (రూ.5.6 కోట్లు)
5. కేఎల్ రాహుల్ (రూ.11 కోట్లు)
6. డేవిడ్ మిల్లర్ (రూ.3 కోట్లు - RTM)
7. ఆరోన్ ఫించ్ (రూ.6.2 కోట్లు)
8. మార్కస్ స్టాయినిస్ (రూ.6.2 కోట్లు-RTM)
9. మయాంక్ అగర్వాల్ (రూ.కోటి)
10. అంకిత్‌సింగ్ రాజ్‌పుత్ (రూ.3 కోట్లు)
11. మనోజ్ తివారీ (రూ.కోటి)
12. మోహిత్ శర్మ (రూ.2.4 కోట్లు- RTM)
13. ముజీబ్ జర్దాన్ (రూ.4 కోట్లు)
14. బరిందర్ శరణ్ (రూ.2.2 కోట్లు)
15. అండ్రూ టై (రూ.7.2 కోట్లు)
16. అక్షదీప్ నాథ్ (రూ.కోటి)
17. బెన్ డ్వార్షుయిస్ (రూ.1.4 కోట్లు)
18. ప్ర‌దీప్ సాహు (రూ.20 ల‌క్ష‌లు)
19. మ‌యాంక్ దాగార్ (రూ.20 ల‌క్ష‌లు)
20. క్రిస్ గేల్ (రూ.2 కోట్లు)
21. మంజూర్ దార్ (రూ.20 ల‌క్ష‌లు)

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 31, 2018, 10:08 [IST]
Other articles published on Jan 31, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+