న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వార్నర్ మైదానంలో అడుగుపెట్టేందుకు కూడా వీల్లేదు: బీసీసీఐ

IPL 2018: Former SRH captain, David Warner has been banished from attending any IPL matches in India; heres why

హైదరాబాద్: కొన్ని రోజుల ముందు వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో నలిగిన ఒకటే టాపిక్ బ్యాల్ ట్యాంపరింగ్. ఈ వివాదంతో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లను తప్పుకు తగ్గట్టుగానే ఆస్ట్రేలియా బోర్డు చర్యలు తీసుకుంది. ఇప్పుడు అదే నేపథ్యంలో బీసీసీఐ కూడా స్పందించిందట. దేశీవాలీ లీగ్‌లోనే అత్యంత ధనిక లీగ్‌గా పేరు పొందింది ఐపీఎల్.

ఈ లీగ్‌లో ఆడేందుకు ఆయా జట్లు తమ రిటైన్ ఆటగాళ్లను మినహాయించి జట్టు కుదుర్చుకునేందుకు వేలంలో పాల్గొన్నాయి. ఈ వేలం అనంతరం అన్ని జట్లకు ఆటగాళ్లు సమకూరడంతో తమ జట్టు కెప్టెన్లు ప్రకటించాయి. ఇందులో సన్ రైజర్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ప్రకటించి ఇంకా ఐపీఎల్ ప్రారంభమైనా కాలేదు. ఆ లోపే బాల్ ట్యాంపరింగ్ ఉదంతం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఏడాది పాటు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లను నిషేదించడం వెంటవెంటనే జరిగిపోయాయి.

అక్కడితో ఆగక ఐపీఎల్ లోనూ ఆ ప్రభావం కనిపించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం డేవిడ్‌ వార్నర్‌ ను కెప్టెన్‌గా బాధ్యతల నుంచి తప్పించి జట్టులో స్థానాన్ని దూరం చేసింది. దీంతో జట్టుపై అమితాభిమానం ఉన్న వార్నర్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. ఇటీవల ఓ సంభాషణలో హైదరాబాద్ జట్టు అభిమాని సృజన కొనకంచి అనే మహిళ డేవిడ్ వార్నర్ కనీసం తన అభిమాన జట్టు మ్యాచ్ వీక్షించేందుకైనా ఎందుకు రావట్లేదని ప్రశ్నించడంతో దానికి వార్నర్ భార్య ఈ విధంగా బదులిచ్చింది.

కొద్ది రోజుల క్రితం వార్నర్‌.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ ఆడే ఏదో ఒక మ్యాచ్‌ ప్రత్యక్షంగా చూసేందుకు తప్పకుండా భారత్‌ వస్తానని చెప్పాడు. ఐతే వార్నర్‌ భారత్‌ వస్తానంటే బీసీసీఐ వద్దని చెప్పింది. ' సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడే మ్యాచ్‌లను చూసేందుకు వార్నర్‌కు భారత్ రావాలని ఉంది. కానీ, బీసీసీఐ వద్దంది. వచ్చే ఏడాది అతను తప్పకుండా వస్తాడు. అతనెంతో ఇష్టపడే జట్టును స్వయంగా కలిసి మద్దతించేందుకు కుదరడం లేదని వార్నర్‌ ఎంతో బాధపడుతున్నాడు' అని వార్నర్‌ భార్య క్యాండైస్‌ వార్నర్‌ పేర్కొంది.

Story first published: Monday, April 23, 2018, 16:14 [IST]
Other articles published on Apr 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X