Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రహానే దూకుడు చూసి వ్యూహం మార్చా, రెండు విజయాలపై దినేశ్ కార్తీక్

IPL 2018: Feels Good to Get Two Wins on the Trot, Says Karthik

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం జైపూర్ వేదికగా రాజస్థాన్-కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాల్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ ఓపెనర్ అజ్యింకె రహానే దూకుడు చూసి తాను వ్యూహం మార్చినట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ వెల్లడించాడు.

మ్యాచ్ అనంతరం దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ 'జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందడం ఆనందంగా ఉంది. మణికట్టు స్పిన్నర్లు ఇబ్బంది పడుతుండటంతో.. సాధారణ స్పిన్నర్లకి బంతిని అప్పగించాను. వారు క్లిక్ అవడంతో రాజస్థాన్‌ని తక్కువ స్కోరుకి కట్టడి చేయగలిగాం. లక్ష్య ఛేదనలో రాబిన్ ఉతప్ప (48) జట్టుకి మెరుగైన ఆరంభానిచ్చాడు' అని పేర్కొన్నాడు.

 నితీశ్ రాణా అద్భుత ప్రదర్శన

నితీశ్ రాణా అద్భుత ప్రదర్శన

'నితీశ్ రాణా మరోసారి ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతను గత ఏడాది ముంబై ఇండియన్స్‌‌ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ ఏడాది కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తరఫున కూడా అదే ప్రదర్శనని కొనసాగిస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ అతను అద్భుతంగా రాణిస్తున్నాడు' అని దినేశ్ కార్తీక్ కొనియాడాడు.

 సునీల్ నరేన్ బౌలింగ్‌లో వరుసగా నాలుగు ఫోర్లు

సునీల్ నరేన్ బౌలింగ్‌లో వరుసగా నాలుగు ఫోర్లు

తొలి మూడు ఓవర్ల వరకు ఒక్క బౌండరీ కూడా లేదు. అప్పటికి స్కోరు కేవలం 9 పరుగులే. అయితే, ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన సునీల్ నరేన్ బౌలింగ్‌లో వరుసగా 4,4,4,4 బాదిన రహానే (36: 19 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సు) చెలరేగి ఒక్కసారిగా ఊపు తెచ్చాడు. ఆ తర్వాత మావీ బౌలింగ్‌లోనూ ఓ సిక్స్ బాదేశాడు.

నితీశ్ రాణాతో ఫలితం రాబట్టిన దినేశ్ కార్తీక్

నితీశ్ రాణాతో ఫలితం రాబట్టిన దినేశ్ కార్తీక్

దీంతో మణికట్టు స్పిన్నర్లు విఫలమవుతున్న వేళ పార్ట్‌ టైమ్ స్పిన్నర్ నితీశ్ రాణాని రంగంలోకి దించి కార్తీక్ ఫలితం రాబట్టాడు. ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌లో నితీశ్ రాణా చేతికి దినేశ్ కార్తీక్ బంతినివ్వగా.. అతను ఐదో బంతికి అజ్యింకె రహానేను అద్భుతమైన స్టంపింగ్‌తో పెవిలియన్‌కు చేర్చాడు.

స్టంపింగ్‌తో ధోనిని మరిపించిన దినేశ్ కార్తీక్

స్టంపింగ్‌తో ధోనిని మరిపించిన దినేశ్ కార్తీక్

ఈ స్టంపింగ్‌తో దినేశ్ కార్తీక్‌ను ధోనిని మరిపించాడు. రానా బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి బంతిని హిట్ చేసేందుకు (36: 19 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సు) ప్రయత్నించాడు. అయితే.. బంతి అతని బ్యాట్‌కి అందకుండా నేరుగా వెళ్లి ఫ్యాడ్స్‌ను తాకి ప్రక్కకు వెళ్లింది. దీంతో బంతి గమనాన్ని పరిశీలించకుండా రహానే రెండు అడుగులు వేశాడు.

మెరుపు వేగంతో బంతిని అందుకుని డైవ్ చేస్తూ

వెంటనే కోల్‌కతా వికెట్ కీపర్ మెరుపు వేగంతో బంతిని అందుకుని డైవ్ చేస్తూ వికెట్లను గిరాటేశాడు. దీంతో నిరాశగా రహానే పెవిలియన్‌కు చేరాడు. అప్పటికే క్రీజులో కుదురుకుని మిడిల్ ఓవర్లలో ధాటికి ఆడేందుకు ప్రయత్నించిన మరో ఓపెనర్ డీఆర్క్‌ షార్ట్ (44: 43 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సు)ని ఔట్ చేసేంది కూడా రాణానే.

7 వికెట్ల తేడాతో కోల్‌కతా విజయం

7 వికెట్ల తేడాతో కోల్‌కతా విజయం

రాణా వేసిన బంతిని అర్ధం చేసుకోలేక డీఆర్క్ షార్ట్ క్లీన్ బౌల్డయ్యాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, సీనియర్ స్పిన్నర్లు పీయూస్ చావ్లా, సునీల్ నరేన్‌లు వికెట్లు తీయలేక ఇబ్బంది పడుతోన్న సమయంలో రాణాని ఉపయోగించి దినేశ్ కార్తీక్ ఫలితం రాబట్టడాన్ని మ్యాచ్ కామెంటేటర్లు సైతం ప్రశంసించారు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టోర్నీలో ఆ జట్టుకి ఇది మూడో విజయం కాగా.. వరుసగా రెండోది.

Story first published: Thursday, April 19, 2018, 15:40 [IST]
Other articles published on Apr 19, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+