
హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం రాత్రి చెన్నై-కోల్‌కతా జట్లు తలపడ్డాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఆటగాడు శుభమాన్ గిల్ హాఫ్ సెంచరీతో మెరవడంతో చెన్నైపై 6 వికెట్ల తేడాతో కోల్‌కతా ఘన విజయం సాధించింది.
అయితే, ఈ మ్యాచ్‌లో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా ఆటతీరుపై అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. టీమిండియా అత్యుత్తమ ఫీల్డర్లలో రవీంద్ర జడేజా ఒకడు. గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఫీల్డింగ్‌లో తడబడ్డాడు.
కోల్‌కతా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సునీల్ నరైన్ ఇచ్చిన వరుస క్యాచ్‌లను అందుకోవడంలో జడేజా విఫలమయ్యాడు. చెన్నై బౌలర్ ఆసిఫ్ వేసిన రెండో ఓవర్ ఐదో బంతిని నరైన్ హిట్ చేశాడు. అది కాస్తా పైకి లేచి మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జడేజా చేతుల్లోకి వెళ్లింది.
నేరుగా చేతుల్లోకి వస్తున్న బంతిని కూడా ఒడిసి పట్టుకోవడంలో జడేజా పూర్తిగా విఫలమయ్యాడు. ఆ తర్వాత బంతికి నరైన్ అది ప్లేస్‌లో మరో క్యాచ్ ఇవ్వగా జడేజా వదిలివేశాడు. దీంతో నరైన్ ఆరు పరుగుల వద్ద ఉండగా వరుస బంతుల్లో రెండు లైఫ్‌లు లభించాయి.
తనకు లభించిన లైఫ్‌లను సద్వినియోగం చేసుకున్న నరైన తనదైన శైలిలో రెచ్చిపోయాడు. 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 32 పరుగులు సాధించి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. మరోవైపు జడేజా చెత్త ఫీల్డింగ్‌పై సోషల్ మీడియాలో అభిమానులు జోకులు పేల్చుతున్నారు.