For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓపెనర్‌గా రోహిత్ కంటే రాహుల్ బెస్ట్: ట్విట్టర్‌లో నెటిజన్ల జోకులు

By Nageshwara Rao
IPL 2018: Fans Call For KL Rahul To Replace Rohit Sharma As Team India Opener

హైదరాబాద్: ఈ ఏడాది జనవరిలో బెంగళూరు వేదికగా జరిగిన వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం కేఎల్ రాహుల్‌ని రూ. 11 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కేఎల్ రాహుల్‌కి అంత మొత్తంలో పంజాబ్ యాజమాన్యం చెల్లించడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

కేఎల్ రాహుల్ వన్ మ్యాన్ షో

కేఎల్ రాహుల్ వన్ మ్యాన్ షో

అతనికి పంజాబ్ అవసరంగా అంత మొత్తం చెల్లించిందని అంతా అనుకున్నారు. అయితే, ఈ సీజన్‌లో కేఎల్ రాహుల్ ప్రదర్శనను చూస్తే మాత్రం ఆ మొత్తానికి అతడు అర్హుడేనని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం పంజాబ్-రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

 ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు

ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు

ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ పంజాబ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. అంతేకాదు ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 84 పరుగులు నమోదు చేశాడు. ఆదివారం రాజస్థాన్ నిర్దేశించిన 153 పరుగుల విజయ లక్ష్యాన్ని పంజాబ్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించిన సంగతి తెలిసిందే.

9 మ్యాచుల్లో 376 పరుగులు

9 మ్యాచుల్లో 376 పరుగులు

పంజాబ్ విజయంలో కేఎల్ రాహుల్ (54 బంతుల్లో 84 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సులు) కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో కేఎల్ రాహుల్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచుల్లో 47 యావరేజితో 376 పరుగులు చేశాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అటు కెప్టెన్‌గా, ఇటు ప్లేయర్‌గా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు.

రోహిత్ స్థానంలో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌

రోహిత్ స్థానంలో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌

దీంతో టీమిండియాలో రోహిత్ స్థానంలో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌ను ఎందుకు తీసుకోకూడదన్న చర్చకు అభిమానులు తెరలేపారు. వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌కప్‌కు రోహిత్ స్థానంలో రాహులే సరైన ఓపెనర్ అవుతాడని చాలా మంది సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు.

Story first published: Monday, May 7, 2018, 17:00 [IST]
Other articles published on May 7, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+