

హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడాలనేది తన కల అని ఐపీఎల్ 2018 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్)కు కెప్టెన్‌గా బరిలోకి దిగబోతున్న దినేశ్ కార్తీక్ వెల్లడించాడు. 32 ఏళ్ల కార్తీక్ 2008లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచి వివిధ ఫ్రాంచైజీల తరుఫున ఆడుతూ వస్తున్నాడు.
కానీ ఇప్పటివరకూ తన సొంత రాష్ట్రమైన తమిళనాడు తరుఫున ఆడే అవకాశం రాలేదని ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాడు. ఐపీఎల్ ప్రారంభమైన తొలి సీజన్‌లో తాను చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడతానని భావించానని దినేశ్ కార్తీక్ చెప్పాడు. అయితే, పది సీజన్లు గడిచినా అది సాధ్యం కాలేదని, ఎప్పటికైనా చెన్నై తరఫున ఆడతాననే నమ్మకం ఉందని అన్నాడు.
చెన్నైలోనే తాను పుట్టి, పెరిగానని అందుకే చెన్నై జట్టుకు ఒక్కసారైనా ఆడాలని అనుకుంటున్నాని అన్నాడు. ఇక, ఐపీఎల్ 2018లో కోల్‌కతా జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక అవడంపై కూడా దినేశ్ కార్తీక్ స్పందించాడు. 'కోల్‌కతా నైట్ రైడర్స్ నాకు ఆరో ఫ్రాంచైజీ. నా పై ఉన్న గౌరవంతో కోల్‌కతా నాయకత్వ బాధ్యతలు అందించడం గొప్పగౌరవంగా భావిస్తాను. దీనికి తగినట్లుగానే నా పాత్రకు తగిన న్యాయం చేస్తాను. వివిధ టోర్నీలో కెప్టెన్‌గా సమర్థవంతంగా రాణించాను. కానీ తొలిసారిగా ఐపీఎల్‌లో కెప్టెన్సీ చేపట్టే అవకాశం వచ్చింది. కచ్చితంగా అంచనాలకు తగ్గట్టుగా జట్టును ముందుండి నడిపిస్తా' అని అన్నాడు.
ఐపీఎల్ ఆడే జట్లలో చెన్నై, బెంగుళూరు, కోల్‌కతా, ముంబై జట్లకు ఎక్కువమంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పాడు. ఏళ్లుగా ఆశాజనకమైన ఆటను ఆడుతున్న చెన్నై జట్టు క్రమంగా ఫ్యాన్ బేస్‌ను పెంచుకుందని తెలిపాడు. కాగా, దినేశ్ కార్తీక్ ఇప్పటి వరకు ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు.
గత 14 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్నా ఇన్నాళ్లూ రాని పేరు ప్రఖ్యాతలు దినేశ్ కార్తీక్‌కు బంగ్లాదేశ్‌తో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో ఫైనల్ చివరి ఓవర్ ద్వారా సంపాదించాడు. కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌తో 8 బంతుల్లో 29 పరుగులతో టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. ఐపీఎల్‌లో 152 మ్యాచ్‌లు ఆడిన దినేశ్ 24.81 యావరేజ్‌తో 2,903 పరుగులు సాధించాడు.