Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అరుదైన 3 రికార్డులు సొంతం చేసుకున్న సన్‌రైజర్స్ జట్టు

IPL 2018, DD vs SRH: Shikhar Dhawan, Kane Williamson earn three big records for Hyderabad

హైదరాబాద్: ఐపీఎల్‌ 11వ సీజన్‌లో ఇప్పటి వరకూ 11మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. 9 విజయాలతో హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్‌ చేరుకున్న తొలి జట్టుగా ఘనతను నమోదు చేసుకుంది. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. బదులుగా హైదరాబాద్ జట్టు 18.5 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే నష్టపోయి లక్ష్యాన్ని చేధించింది.

బౌలర్లపై రిషబ్ పంత్ ఎదురుదాడి:

బౌలర్లపై రిషబ్ పంత్ ఎదురుదాడి:

సన్‌రైజర్స్ బౌలర్లపై ఎదురు దాడికి రిషబ్ పంత్ (128 నాటౌట్) అజేయ సెంచరీతో ఢిల్లీకి భారీ స్కోర్ అందించాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఆరంభంలోనే ఓపెనర్ హేల్స్ వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విలియమ్సన్ (83) శిఖర్ ధావన్‌ (92)లు కలిసి జట్టుకు విజయాన్ని అందించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 176 పరుగులు జోడించారు. ఈ ఐపీఎల్ సీజన్లో ఇదే అత్యుత్తమ పార్టనర్‌షిప్ కాగా, సన్‌రైజర్స్ తరఫున అత్యధిక భాగస్వామ్యం ఇదే కావడం విశేషం.

ఇదే అత్యధిక లక్ష్య చేధన:

ఇదే అత్యధిక లక్ష్య చేధన:

సన్‌రైజర్స్‌కు ఇదే అత్యధిక లక్ష్య చేధన కావడం గమనార్హం. 2014లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 186 పరుగులు చేసి గెలవడమే ఛేజింగ్‌లో హైదరాబాద్‌కు అత్యధికం. సన్‌రైజర్స్ నెలకొల్పిన నాలుగు అత్యుత్తమ భాగస్వామ్యాల్లో ధావన్‌ పాత్ర ఉండటం విశేషం.

ధావన్-విలియమ్సన్ అత్యధిక పార్టనర్‌షిప్ (176):

ధావన్-విలియమ్సన్ అత్యధిక పార్టనర్‌షిప్ (176):

సన్‌రైజర్స్ తరఫున అత్యధిక పార్టనర్‌షిప్ నెలకొల్పిన (176) ధావన్-విలియమ్సన్ జోడి. వార్నర్-ధావన్ జోడి గతేడాది కోల్‌కతా మీద 139 పరుగులు జోడించారు. అంతకు ముందే ఏడాది గుజరాత్‌పై వీరిద్దరూ 137 జోడించారు. 2017లో ధావన్-విలియమ్సన్ జోడి ఢిల్లీపైనే 136 పరుగులు జోడించడం గమనార్హం.

వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసిన హైదరాబాద్:

వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసిన హైదరాబాద్:

హైదరాబాద్‌కు ఇది వరుసగా ఆరో విజయం. గత రెండేళ్లు ఆ జట్టు వరుసగా ఐదేసి చొప్పున విజయాలు సాధించింది. కానీ కోచ్ టామ్ మూడీ నమ్మకాన్ని నిలబెడుతూ ధావన్ ఢిల్లీపై చెలరేగి ఆడాడు. సొంత గడ్డ మీద సిక్స్‌‌లు, ఫోర్లతో సత్తా చాటాడు.184 సగటుతో.. విలియమ్సన్‌తో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు. కీలకమైన ప్లేఆఫ్ ముంగిట ధావన్ తిరిగి సత్తా చాటడంతో సన్‌రైజర్స్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. గబ్బర్ ఈజ్ బ్యాక్ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Friday, May 11, 2018, 10:49 [IST]
Other articles published on May 11, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+