ఐపీఎల్ 2018: తొలి మ్యాచ్‌కు సన్‌రైజర్స్ సిద్ధం, ట్విట్టర్‌లో వార్నర్ సందేశం

Posted By:
David Warner

హైదరాబాద్: డేవిడ్ వార్నర్... 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుని ఐపీఎల్ విజేతగా నిలిపిన కెప్టెన్. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్‌కు పాల్పడటంతో క్రికెట్ ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ నిషేధంతో డేవిడ్ వార్నర్ ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

 వార్నర్ మనసు మాత్రం ఇక్కడే

వార్నర్ మనసు మాత్రం ఇక్కడే

ఐపీఎల్‌కు దూరమైన వార్నర్ మనసు మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుతోనే ఉంది. ఎందుకంటే ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సోమవారం తన మొదటి మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్ నగరంలోని ఉప్పల్‌లో ఉన్న రాజీవ్‌ గాంధీ స్టేడియం వేదికగా రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది.

గుడ్ లక్ టు మై ఫ్రెండ్స్

ఈ మ్యాచ్‌ కోసం సన్‌రైజర్స్ పూర్తిగా సిద్ధమైంది. ఈ సందర్భంగా వార్నర్ మాజీ కెప్టెన్‌గా జట్టుపై తనకు ఉన్న అభిమానాన్ని చాటాడు. హైదరాబాద్ జట్టుకు శుభాకాంక్షలు చెబుతూ వార్నర్ ట్వీట్ చేశాడు. ''గుడ్ లక్ టు మై ఫ్రెండ్స్ సన్‌రైజర్స్.. ఈ రాత్రి మంచిగా ఆడండి'' అంటూ సన్‌రైజర్స్‌కి వార్నర్ తన సందేశాన్ని అందించాడు.

'వి మిస్ యూ వార్నర్‌' అంటూ కామెంట్లు

'వి మిస్ యూ వార్నర్‌' అంటూ కామెంట్లు

ఈ ట్వీట్‌పై నెటిజన్లు 'వి మిస్ యూ వార్నర్‌' అంటూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. సన్‌రైజర్స్ జెర్సీ అవిష్కరణ కార్యక్రమంలో భాగంగా భువనేశ్వర్‌ కుమార్‌ అభిమానులతో లైవ్‌ చాట్‌ చేస్తుండగా వార్నర్‌ ‘హలో భువి' అని పలకరించాడు. అంతేకాక.. ఐపీఎల్ చూసేందుకు ఇండియా వస్తానని కూడా తెలిపాడు.

వార్నర్ కెప్టెన్సీలో 2016 ఐపీఎల్ విజేతగా సన్‌రైజర్స్

వార్నర్ కెప్టెన్సీలో 2016 ఐపీఎల్ విజేతగా సన్‌రైజర్స్

వార్నర్ కెప్టెన్సీలో 2016 ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా డేవిడ్ వార్నర్‌ ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో ఆతడి స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు సన్‌రైజర్స్ యాజమాన్యం కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 9, 2018, 18:13 [IST]
Other articles published on Apr 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి