For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: క్రికెటర్లే కాదు వారి కుటుంబాల్లో కూడా..

IPL 2018: David Warner's Daughter Ivy Mae Dances To Sunrisers Hyderabad's Anthem

హైదరాబాద్: 2016 ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పదకొండో ఐపీఎల్ పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉంది. 2016 లీగ్‌లో ఫైనల్ మ్యాచ్ ఆడిన కోహ్లీ సేన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఎనిమిది పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టు ముందు పరాజయానికి గురైంది. ఈ ఏడాది అదే దూకుడుతో ముందుకు వెళ్లాలని హైదరాబాద్ జట్టు యోచిస్తోంది. దీంతో క్రికెటర్లకే కాదు. వాళ్ల కుటుంబాల్లో కూడా ఐపీఎల్ సందడి మొదలైంది.

సన్‌రైజర్స్‌ హైదారాబాద్‌ సారథి డేవిడ్‌ వార్నర్‌ కుటుంబం గత ఐపీఎల్‌లో సందడి చేశారు. ఇప్పుడు అదే విషయాన్ని మళ్లీ గుర్తు చేసుకున్నాడు జట్టుకు చెందిన డేవిడ్ వార్నర్. ఎందుకంటే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ పాటను పెట్టుకుని అతని పిల్లలు డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారంట. దీంతో అతని ఇంట్లో ఐపీఎల్ హడావుడి మొదలైపోయిందంటూ సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నాడు.

'సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పాట కోసం ఐవీ మే ఆసక్తిగా ఉంది. నాన్‌స్టాప్‌గా పాటను ప్లే చేస్తూ డ్యాన్స్‌ చేస్తూనే ఉంది. త్వరలో మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఆరెంజ్‌ ఆర్మీకి ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉంది.' అని వార్నర్‌ పేర్కొన్నాడు.

2016 సీజన్‌లో వార్నర్‌ నాయకత్వంలోని సన్‌రైజర్స్‌ హైదరాబాద్.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఈ ఏడాది హైదరాబాద్‌ ప్లేయర్‌ రిటెన్షన్‌లో డేవిడ్‌ వార్నర్‌తో పాటు భువనేశ్వర్‌ను తన వద్దే అట్టి పెట్టుకుంది.

2018 ఐపీఎల్ పాల్గొననున్న హైదరాబాద్ జట్టు:
సన్‌రైజర్స్ హైదరాబాద్
1. డేవిడ్ వార్నర్ (రూ.12 కోట్లు-Retained)
2. భువనేశ్వర్ కుమార్ (రూ.8.5 కోట్లు-Retained)
3. శిఖర్ ధావన్ (రూ.5.2 కోట్లు-RTM)
4. షకీబుల్ హసన్ (రూ.2 కోట్లు)
5. కేన్ విలియమ్సన్ (రూ.3 కోట్లు)
6. కార్లోస్ బ్రేత్‌వైట్ (రూ.2 కోట్లు)
7. యూసుఫ్ పఠాన్ (రూ.1.9 కోట్లు)
8. మనీష్ పాండే (రూ.11 కోట్లు)
9. వృద్ధిమాన్ సాహా (రూ.5 కోట్లు)
10. రషీద్ ఖాన్ (రూ.9 కోట్లు-RTM)
11. రిక్కీ భుయ్ (రూ.20 లక్షలు)
12. దీపక్ హుడా (రూ.3.6 కోట్లు-RTM)
13. సిద్ధార్థ్ కౌల్ (రూ.3.8 కోట్లు)
14. టీ నటరాజన్ (రూ.40 లక్షలు)
15. బేసిల్ థంపి (రూ.95 లక్షలు)
16. సయ్యద్ ఖలీల్ అహ్మద్ (రూ.3 కోట్లు)
17. మహ్మద్ నబీ (రూ.కోటి)
18. సందీప్ శర్మ (రూ.3 కోట్లు)
19. సచిన్ బేబీ (రూ.20 లక్షలు)
20. క్రిస్ జోర్డాన్ (రూ.కోటి)
21. బిల్లీ స్టాన్‌లేక్ (రూ.50 లక్షలు)
22. తన్మయ్ అగర్వాల్ (రూ.20 లక్షలు)
23. శ్రీవ‌త్స గోస్వామి (రూ.కోటి)
24. బిపుల్ శ‌ర్మ (రూ.20 ల‌క్ష‌లు)
25. మెహ‌దీ హ‌స‌న్ (రూ.20 ల‌క్ష‌లు)

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 31, 2018, 13:15 [IST]
Other articles published on Jan 31, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+