
బాల్ టాంపరింగ్ ఎంత పనిచేసింది
ఈ బాల్ టాంపరింగ్ ఉందతం క్రికెట్ ఆస్ట్రేలియాకు ఎంత నష్టం కలిగించిందో... ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అంతే నష్టం కలిగించింది. గత ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌ల్లో 45 యావరేజితో 641 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ అన్నీ తానై జట్టుని నడిపించిన తీరు అద్భుతం. అలాంటి వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం పడింది.

కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్
దీంతో ఐపీఎల్ 11వ సీజన్‌కు డేవిడ్ వార్నర్ అందుబాటులో లేకుండా పోయాడు. వార్నర్ స్థానంలో సారథ్య బాథ్యతలను న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ అందుకున్నాడు. ఇక, వార్నర్ స్థానాన్ని పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేని అలెక్స్ హేల్స్‌తో భర్తీ చేశారు. వీళ్లు ఏ మేరకు వార్నర్ లేని లోటును భర్తీ చేస్తారో చూడాలి.

వార్నర్ స్థానంలో ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ విషయానికి వస్తే వార్నర్ స్థానంలో జట్టులోకొచ్చిన హేల్స్ సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. అయితే దీనిపై జట్టు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. సన్‌రైజర్స్‌కు మొదటి నుంచీ ఓపెనర్‌గా వ్యవహరిస్తున్న ధావన్ (2017లో 449 పరుగులు) ఈ సీజన్‌లో కీలకంగా వ్యవహారించనున్నాడు.

ఫామ్‌లో శిఖర్ ధావన్
ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో ధావన్ ఫామ్‌లోకి రావడం జట్టుకు కలిసొచ్చే అంశం. సన్‌రైజర్స్ 2016 ప్రదర్శనను పునరావృతం చేయాలంటే ఓపెరన్లు శిఖర్ ధావన్, అలెక్స్ హేల్స్ శక్తిమేరకు ఆడాల్సి ఉంటుంది. ఇక మిడిలార్డర్‌లో మనీష్ పాండే, విలియమ్సన్, యూసుఫ్ పఠాన్, దీపక్ హుడా, సాహాలతో జట్టు బలంగా కనిపిస్తోంది.

భువీ అద్భుత ప్రదర్శన
బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్‌కుమార్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. భువీలేని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుని చూడలేం. ముఖ్యంగా డెత్ ఓవర్లలో భువీ అద్భుతమైన బౌలర్. 2016, 2017 సీజన్‌లలో అత్యధిక వికెట్లతో పర్పెల్ క్యాప్‌ని అందుకున్నాడు. భువీకి తోడు అఫ్ఘన్ లెగ్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ రాణిస్తే సన్‌రైజర్స్ విజయాలు సాధించడం ఖాయం.

గతేడాది 17 వికెట్లు తీసిన రషీద్ ఖాన్
గతేడాది రషీద్ ఖాన్ మొత్తం 17 వికెట్లు తీశాడు. బౌలింగ్‌లో భువీతో పాటు సిద్ధార్థ్ కౌల్ (16 వికెట్లు), సందీప్‌శర్మ (17), బాసిల్ థంపి (11) వంటి వైవిధ్యమైన పేసర్లు జట్టులో ఉండటం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చే అంశం. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న ప్రధాన లోపం ఏంటంటే భారీ షాట్లతో విధ్వంసం సృష్టించగల బ్యాట్స్‌మన్ లేకపోవడమే.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు
కీలక ఆటగాళ్లు: ధావన్, విలియమ్సన్, మనీష్ పాండే, భువనేశ్వర్, రషీద్ ఖాన్, షకిబ్ అల్ హాసన్
దేశీయ ఆటగాళ్లు: ధావన్, మనీష్ పాండే, భువనేశ్వర్, సాహా, సిద్ధార్థ్ కౌల్, దీపక్ హుడా, ఖలీల్ అహ్మద్, సందీప్‌శర్మ, యూసుఫ్, శ్రీవత్స్ గోస్వామి, రిక్కీ భుయ్, బాసిల్ థంపి, నటరాజన్, సచిన్ బేబి, బిపుల్‌శర్మ, మెహదీ హసన్, తన్మయ్ అగర్వాల్,
విదేశీ ఆటగాళ్లు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అలెక్స్ హేల్స్, కార్లోస్ బ్రాత్‌వైట్, రషీద్‌ఖాన్, షకీబుల్ హసన్, మహ్మద్ నబి, క్రిస్ జోర్డాన్, బిల్లీ స్టాన్‌లేక్,
కోచ్: టామ్ మూడీ (ఆస్ట్రేలియా)
బౌలింగ్ కోచ్: ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక)
జట్టు మెంటార్: వీవీఎస్ లక్ష్మణ్ (ఇండియా)


Click it and Unblock the Notifications

