Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2018: టైటిల్ విజేత ఎవరో చెప్పేసిన డేనియెల్లి వాట్

IPL 2018: Danielle Wyatt reveals the name of her favourite to win the tournament

హైదరాబాద్: డేనియెల్లి వాట్... భారత అభిమానులకు పరిచయం అక్కర్లేని ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్. ఎందుకంటే కోహ్లీని ట్విటర్‌‌లో 'కోహ్లీ నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని అడిగి అప్పట్లో వార్తల్లో నిలిచింది కాబట్టి. ఈ అమ్మడి చూపు ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై పడింది.

విరాట్ కోహ్లీని అమితంగా ఇష్టపడే డేనియెల్లి వాట్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ టైటిల్ విజేతగా ఏ జట్టు నిలుస్తుందని ఓ అభిమాని డేనియెల్లిని ప్రశ్నించగా, తడుముకోకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్ అని చెప్పేసింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.

నిజానికి డేనియెల్లి వాట్‌కు ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. కానీ ఈ సీజన్‌లో బెంగళూరు జట్టు పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకోవడంతో డేనియెల్లి తన మద్దతు సన్‌రైజర్స్‌కు ప్రకటించింది.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో 8 గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టోర్నీలో భాగంగా సన్‌రైజర్స్‌ తన తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తలపడనుంది. బాల్ టాంపరింగ్ వివాదంతో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 11వ సీజన్‌కు దూరం కావడంతో సన్‌రైజర్స్ కెప్టెన్సీ పగ్గాలను యాజమాన్యం విలియమ్సన్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే.

అనుకోకుండా కేన్ విలియమ్సన్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. అయినా సరే తన దేశం తరుపున జాతీయ జట్టుకు కెప్టెన్‌గా చేసిన అనుభవంతో ఎలాంటి ఆందోళన చెందకుండా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌లు ఆడుతూ, జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. 10 మ్యాచ్‌లాడిన విలియమ్సన్ 410 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

Story first published: Thursday, May 10, 2018, 17:04 [IST]
Other articles published on May 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+