For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రైజర్స్‌ను రఫ్ఫాడించిన రాయుడు, సెంచరీ మామయ్యకు అంకితం

IPL 2018, CSK vs SRH Highlights: Ambati Rayudu century takes CSK closer to playoffs in 8-wicket win

హైదరాబాద్: రైజర్స్‌పై అద్వితీయమైన ప్రదర్శన చేసి చెలరేగిపోయాడు అంబటి రాయుడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలింగ్‌ను ఎడాపెడా ఉతికేసిన రాయుడు.. చెన్నై జట్టుకు అలవోక విజయాన్ని అందించాడు. ఆదివారం మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. అతి కష్టంతో శిఖర్‌ ధావన్‌ (79), విలియమ్సన్‌ (51) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు.

వీరికి పోటీగా చేధనలో రాయుడు, వాట్సన్‌ మెరుపులతో 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకోగలిగింది చెన్నై. 180 పరుగుల ఛేదనలో రాయుడు ప్రత్యర్థికి ఊపిరాడనీయలేదు. లీగ్ మొత్తంలో బౌలింగే ప్రధాన బలంగా దూసుకుపోతోన్న హైదరాబాద్‌కు చుక్కలు చూపించాడు. రాయుడు భువి బౌలింగ్‌లో సిక్స్‌తో మొదలు పెట్టి వరుస బాదుడు బాదాడు. షకిబ్‌, రషీద్‌ఖాన్‌, కౌల్‌ బౌలింగ్‌నైతే ఉతికేశాడు.

1
43456

కౌల్‌ బౌలింగ్‌లో మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రాయుడు.. రషీద్‌కు సైతం ఓ సిక్స్‌‌తో షాకిచ్చాడు. ముఖ్యంగా షకిబ్‌ను లక్ష్యంగా చేసుకుని రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదాడు. వ్యక్తిగత స్కోరు 80ల్లోకి వచ్చాక కాస్త నెమ్మదించిన అతను..జట్టు విజయానికి మరో రెండు పరుగులు అవసరమైన సమయంలో భువి బౌలింగ్‌లో సింగిల్‌ తీసి 62 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో తన సెంచరీని దివంగత మేనమామ మెండు సత్యనారాయణకు అంకితమిస్తున్నానని రాయుడు చెప్పాడు. కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి అయిన సత్యనారాయణ (68) ఆదివారం కన్నుమూశారు. గుంటూరు జిల్లా ఖాజీపాలెంకు చెందిన సత్యనారాయణ సెంట్రల్‌ డ్రగ్స్‌ డిపార్ట్‌మెంట్‌లో సూపరింటెండ్‌ హోదాలో పని చేశారు. రిటైర్మెంట్‌ అనంతరం హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌లో నివాసముంటున్నారు. ఏప్రిల్ నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Story first published: Monday, May 14, 2018, 11:28 [IST]
Other articles published on May 14, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+