ఢిల్లీపై విజయంతో.. చెన్నై జట్టు వందకొట్టేసింది

హైదరాబాద్: కొత్త కెప్టెన్ నాయకత్వంలో ఐపీఎల్ 30వ మ్యాచ్ ఆడిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ చిత్తు చేసింది. అంతేకాదు, ఆ విజయంతో పాటు చెన్నై జట్టు కెప్టెన్‌కు మరో రెండు రికార్డులు వచ్చి చేరాయి. ఒకటి ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసింది. అత్యధిక టీ20 మ్యాచ్ లు గెలిచిన జట్టుగా మరొక రికార్డు నమోదు చేసింది.

చెన్నై @100:
అత్యధిక టీ20లు గెలిచిన జట్ల జాబితాలో చెన్నై సూపర్‌కింగ్స్ రెండో స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 11వ సీజన్‌లో భాగంగా సోమవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయంతో చెన్నై ఈ ఘనత సాధించింది. దీంతో ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ 100 విజయాలు నమోదు చేసింది. ఇవన్నీ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోనే కావడం విశేషం.

ముంబై: చెన్నై కంటే ముందు ముంబై:
అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిచిన జట్ల జాబితాలో మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ముంబై ఇండియన్స్ ఉంది. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ 186 మ్యాచ్‌లు ఆడగా అందులో 104 విజయాలను నమోదు చేసుకుని అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు 94 విజయాలతో మూడో స్థానంలో ఉన్న చెన్నై 6 విజయాలు నమోదు చేసుకుని వంద విజయాలతో రెండో స్థానంలోకి దూసుకెళ్లింది.

రాయల్ ఛాలెంజర్స్ పైనే 12 సార్లు:
చెన్నై సూపర్‌కింగ్స్ మొత్తం 166(ఛాంపియన్స్ లీగ్‌తో కలిపి) మ్యాచ్‌లు ఆడగా 100 విజయాలు నమోదు చేసుకుంది. ఐపీఎల్‌లో చెన్నై అత్యధిక విజయాలను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైనే సాధించింది. 12 సార్లు చెన్నై.. ఆర్‌సీబీపై గెలిచింది.

ఈ సీజన్‌కి సీన్ రివర్స్:
రెండేళ్ల పాటు నిషేధం కారణంగా ఐపీఎల్‌కు దూరమైంది చెన్నై. ఇదే జరగకుండా ఉంటే ధోనీ నాయకత్వంలోని చెన్నై జట్టు ఈ జాబితాలో ఎప్పుడో అగ్రస్థానాన్ని దక్కించుకునేది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మరో పక్క మొదటి స్థానంలో ఉన్న ముంబై ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు విజయాలనే నమోదు చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications