Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కీలక నిర్ణయం: చెన్నై బ్యాటింగ్ కోచ్‌గా మైక్ హస్సీ

IPL 2018: CSK rope in Michael Hussey as batting coach

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్‌ మైక్‌ హస్సీ నియమితుడయ్యాడు. రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌లోకి పునరాగమనం చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్‌.. టోర్నీలో తనదైన ముద్ర వేసేందుకు ఇప్పటినుంచే ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంగా ఇటీవల ముంబైలో జరిగిన ఆటగాళ్ల రిటెన్షన్ పద్ధతిలో ఆ జట్టు ప్రధాన ఆటగాళ్లు అయిన మహేంద్రసింగ్ ధోని, సురేశ్ రైనా, రవీంద్ర జడేజాలను తన వద్దే అట్టిపెట్టుకుంది. ఏడు సీజన్లపాటు చెన్నై జట్టుకు ఆటగాడిగా ప్రాతినిథ్యం వహించిన హస్సీ.. ఇప్పుడు అదే జట్టుకు కోచ్‌గా ఎంపిక చేసింది.

ఐపీఎల్ 2011, 2012, 2013 సీజన్లలో చెన్నై జట్టు సాధించిన అనేక విజయాల్లో హస్సీ కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత ఏడాది అతను ముంబై ఇండియన్స్‌కి వెళ్లినా.. 2015లో మళ్లీ చెన్నై జట్టు అతడిని దక్కించు కోవడం విశేషం. నిషేధం కారణంగా 2016, 2017 సీజన్లకి రాజస్థాన్ రాయల్స్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్లు టోర్నీకి దూరమయ్యాయి.

ఈ క్రమంలో చెన్నై జట్టులోని ఆటగాళ్లంతా చెల్లాచెదురయ్యారు. తాజాగా మళ్లీ అప్పట్లో చెన్నైని రెండుసార్లు విజేతగా నిలబెట్టిన ఆటగాళ్లను చెన్నై కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఐపీఎల్ 2018 సీజన్‌కి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా మైకేల్ హస్సీని నియమిస్తూ చెన్నై ఫ్రాంఛైజీ నిర్ణయం తీసుకుంది.

'ఐపీఎల్‌లో రెండేళ్లు విరామం అంటే చాలా ఎక్కువ సమయమే. ఆటగాళ్లు చాలా మంది మారిపోయారు. కానీ.. చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడూ బాగా పరుగులు చేసే జట్టు. కోచింగ్ సిబ్బందికి జట్టు యాజమాన్యం పూర్తి స్వేచ్ఛనిస్తుంది. ఫ్రాంఛైజీ సరైన ఆటగాళ్లని ఎంచుకుంటే.. కోచ్ పని మరింత సులువవుతుంది. కచ్చితంగా ఈ సీజన్‌ టోర్నీలో సీఎస్‌కే ఆధిపత్యం చెలాయిస్తుంది' అని హస్సీ అన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, January 7, 2018, 17:03 [IST]
Other articles published on Jan 7, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+