Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్లే‌ఆఫ్స్‌కు ముందు పంజాబ్‌తో మ్యాచ్: చెన్నై 'ట్రిపుల్ ఓవర్ త్రో' (వీడియో)

IPL 2018: Comedy of errors by Chennai’s fielders

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఇన్నింగ్స్‌లో సమయంలో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది.

శార్దుల్ ఠాకూర్ వేసిన 9వ ఓవర్ ఐదో బంతిని పంజాబ్ బ్యాట్స్‌మన్ మనోజ్ తివారీ మిడాఫ్ దిశగా షాట్ కొట్టాడు. బ్యాట్స్‌మెన్ పరుగు కోసం ప్రయత్నించడంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా ఓవర్ త్రో వేశాడు. స్టంప్స్‌ను తాకకుండా బంతి స్కేర్‌లెగ్ వైపు వెళ్లింది.

ఒక్క పరుగు స్థానంలో మూడు పరుగులు

మరో పరుగు కోసం ప్రయత్నించడంతో ఫీల్డర్ డ్వేన్ బ్రావో బంతిని కీపర్ ధోనీ వైపు విసిరాడు. ఈసారి బంతి ధోని కాళ్ల పక్క నుంచి వెళ్లడంతో కింగ్స్ బ్యాట్స్‌మెన్ మరో పరుగు తీశారు. చెన్నై ఫీల్డర్లు చేసిన ఫీల్డింగ్ తప్పిదాల వల్ల ఒక్క పరుగు స్థానంలో మూడు పరుగులు వచ్చాయి.

5 వికెట్ల తేడాతో పంజాబ్‌పై చెన్నై విజయం

5 వికెట్ల తేడాతో పంజాబ్‌పై చెన్నై విజయం

ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ఐపీఎల్ వెబ్‌సైట్‌లో అభిమానుల కోసం పోస్టు చేసింది. కాగా, ఈ మ్యాచ్‌లో సురేశ్ రైనా (61 నాటౌట్) చేలరేగడంతో పంజాబ్‌పై 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అలవోక విజయాన్ని నమోదు చేసింది. అంతకముందు కరుణ్ నాయర్(54) హాఫ్ సెంచరీ సాధించినా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో 19.4 ఓవర్లోనే పంజాబ్ 153 పరుగులకు ఆలౌటైంది.

బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన భజ్జీ

బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన భజ్జీ

దీంతో 154 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు అంబటి రాయుడు (1), డుప్లెసిస్ (14) విఫలమైనా.. ప్రయోగాత్మకంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన హర్భజన్ సింగ్ (19), దీపక్ చాహర్ (39) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కీలక సమయంలో వీరిద్దరూ పెవిలియన్ చేరినప్పటికీ, చివర్లో సురేశ్ రైనాతో కలిసి ధోని (16 నాటౌట్) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

పాయింట్ల పట్టికలో చెన్నై రెండో స్థానంలో నిలవగా

పాయింట్ల పట్టికలో చెన్నై రెండో స్థానంలో నిలవగా

ఈ విజయంతో పాయింట్ల పట్టికలో చెన్నై రెండో స్థానంలో నిలవగా... ఏడో స్థానంలో నిలిచిన పంజాబ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో మిగిలిన నాలుగో ప్లేఆఫ్ బెర్తు రాజస్థాన్ రాయల్స్‌కి ఖాయమైంది. ఈ సీజన్‌లో ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Monday, May 21, 2018, 12:22 [IST]
Other articles published on May 21, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+