
షేన్ వాట్సన్ సెంచరీ:
ఇప్పటివరకూ ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన క్రిస్ గేల్(6) పేరిట ఉండగా, కోహ్లీ(4) రెండో స్థానంలో ఉన్నాడు. ఇంతకుముందు 2008-15వరకూ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీకి ఆడిన వాట్సన్..తన ఐపీఎల్ కెరీర్‌లో మూడో సెంచరీ రాజస్థాన్ రాయల్స్‌పైనే నమోదు చేయడం విశేషం. అంతకుముందు 2013లో ఇదే చెన్నై సూపర్ కింగ్స్‌పై తొలి సెంచరీ(101) సాధించగా, కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై రెండో సెంచరీ(104) బాదేశాడు. 2016-17 కాలంలో వాట్సన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడాడు.

క్యాచ్ మిస్ చేసుకున్నందుకే ఓడిపోయారా:
రెండుసార్లు వాట్సన్ అందించిన క్యాచ్‌ను మిస్ చేసినందుకే రాజస్థాన్ రాయల్స్ పేరిట ఓటమి శాపమైంది. స్టూవర్ట్ బిన్నీ వేసిన తొలి ఓవర్‌లోనే వాట్సన్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న రాహుల్ త్రిపాఠి నేలపాలు చేశాడు. తర్వాత స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి వాట్సన్ మరో క్యాచ్ అందించాడు. అయితే ఆఫ్‌సైడ్ ఫీల్డింగ్‌లో ఉన్న త్రిపాఠి మరోసారి క్యాచ్‌ను చేజార్చాడు.

త్రిపాఠి క్యాచ్ మిస్ చేయడం వల్ల వాట్సన్:
రెండుసార్లు త్రిపాఠి క్యాచ్ మిస్ చేయడం వల్ల వాట్సన్ బతికిపోయాడు. ఇక అప్పటి నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన వాట్సన్ ఏకంగా సెంచరీతో కదం తొక్కాడు. జట్టు భారీ స్కోరు సాధించే విధంగా తోడ్పాడ్డాడు. అనంతరం బంతితోనూ చెలరేగి రాజస్థాన్‌ను కట్టడి చేశాడు. మూడు ఓవర్లు బంతులు విసిరి కేవలం 13 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.

పాత జట్టుతో ప్రత్యర్థిగా ఆడటమే:
‘పాత జట్టుతో ప్రత్యర్థిగా ఆడటమే నాలో అదనపు ఉత్సాహాన్ని నింపింది. ఈ రోజు(శుక్రవారం) ప్రదర్శన ఎంతో ఆనందాన్నిచ్చింది. ఇలాంటి రోజు కోసం..ఇలాంటి ఇన్నింగ్స్ కోసమే చాలా సంవత్సరాల నుంచి కలలుకంటున్నానని' పేర్కొన్నాడు. కెప్టెన్ ధోనీ గురించి చెప్తూ..‘అతను ఆటను చాలా బాగా అర్థం చేసుకుంటాడు. అందుకు అనుగుణంగానే ప్రణాళికలు రచించి వాటిని ఆచరణలో పెట్టి విజయం సాధిస్తాడని' ఈ ఆల్‌రౌండర్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












