For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గేల్ రాకతో.. మీ అందరికీ నిద్రలేని రాత్రులు మొదలైనట్లే: రాహుల్

 IPL 2018: Chris Gayle is back and it is bad news for other teams, says KL Rahul

హైదరాబాద్: సీజన్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌తో తిరిగి తన పాత ఫామ్‌ను చూపించాడు విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్. కేవలం 33 బంతుల్లోనే 66 పరుగులు చేసిన అతను గతేడాది ఐపీఎల్‌లో ఏ మాత్రం రాణించలేదు. ఇందుకు గాను జనవరి ఆఖరి వారంలో జరిగిన వేలంలో ఎవ్వరూ కొనేందుకు ముందుకు రాలేదు. జరిగిన రెండు రోజుల వేలంలో రెండు రౌండ్లలోనూ కొనకపోవడంతో ఆఖరుగా ప్రీతి జింతా కొనుగోలు చేసి పంజాబ్ జట్టులో చేర్చుకుంది.

సీజన్ మొదలైనప్పటి నుంచి తొలిసారి ఆడిన గేల్ చెన్నై జట్టుపై విరుచుకుపడ్డాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కరీబియన్ స్టార్ గేల్ జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 197 పరుగులు చేసింది. ఇందులో గేల్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఈ నేపథ్యంలో క్రిస్‌గేల్ తన మునుపటి ఫామ్‌ను కనబర్చడంపై గేల్‌తో ఓపెనింగ్ బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ స్పందించాడు.

'అతడి మెరుపు బ్యాటింగ్‌తో మిగతా జట్లకు నిద్రలేని రాత్రులేనని అభిప్రాయపడ్డాడు. లీగ్‌లోని ప్రత్యర్థి జట్లకు హెచ్చరిక కూడా చేశాడు. క్రిస్‌గేల్ బంతితో రాణించడంతో మా జట్టుకు ఇదొక అద్భుతమైన వార్త. కానీ మిగతా జట్లకు ఇది చెడ్డవార్తే. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉన్న అతనిలో ఉందన్న విషయం మా అందరికీ తెలుసు. తనదైన రోజున విధ్వంసం సృష్టిస్తాడు. అదే చెన్నైతో మ్యాచ్‌లో చేసి చూపించాడు. అతన్ని జట్టులో కొనసాగించాలని.. ఇదే ఫామ్‌ను తరువాతి మ్యాచ్‌ల్లో పునరావృతం చేయాలని కోరుకుంటున్నాం'. అని మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో రాహుల్ పేర్కొన్నాడు.

వేలంలో తొలి రెండు రౌండ్ల అనంతరం కనీసధర రూ.2కోట్లు పెట్టి బాలీవుడ్ నటి ప్రీతి జింతా సహ యాజమానిగా ఉన్న పంజాబ్ కనికరించింది. ఇదే తరహాలో యువరాజ్‌సింగ్‌ను కూడా ఫ్రాంఛైజీ దక్కించుకుంది. పంజాబ్ తన తరువాతి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడనుంది. గేల్ ఇదే ఫామ్‌ను మిగతా మ్యాచ్‌ల్లోనూ కొనసాగిస్తాడని జట్టు యాజమాన్యం యోచిస్తోంది.

Story first published: Monday, April 16, 2018, 18:03 [IST]
Other articles published on Apr 16, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+