ఐపీఎల్: క్రిస్‌గేల్‌ను గ్రేటెస్ట్ టీ20 బ్యాట్స్‌మన్ అన్నది ఎవరో తెలుసా?

హైదరాబాద్: ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న క్రిస్ గేల్‌పై చెన్నై ఆటగాడు షేన్ వాట్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షేన్ వాట్సన్ శుక్రవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.

గేల్ తర్వాత సెంచరీ నమోదు చేసిన రెండో ఆటగాడు
ఐపీఎల్‌లో వాట్సన్‌కి ఇది మూడో సెంచరీ కావడం విశేషం. ఇక, ఐపీఎల్ 11వ సీజన్‌లో క్రిస్ గేల్ తర్వాత సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. వాట్సన్ సెంచరీతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది.

64 పరుగుల తేడాతో రాజస్థాన్‌పై విజయం
అనంతరం లక్ష్య చేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 18.3 ఓవర్లలో 140 పరుగులకే పరిమితమైంది. దీంతో చెన్నై 64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. గత ఐపీఎల్ సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ తరుపున రెండు సెంచరీలు సాధించిన షేన్ వాట్సన్... అదే రాజస్థాన్‌పై మూడో సెంచరీని సాధించాడు.

క్రిస్ గేల్ గ్రేటెస్ట్ టీ20 బ్యాట్స్‌మన్
మ్యాచ్ అనంతరం షేన్ వాట్సన్ మాట్లాడుతూ 'ప్రపంచంలోనే క్రిస్ గేల్ గ్రేటెస్ట్ టీ20 బ్యాట్స్‌మన్. టీ20ల్లో అధిక సెంచరీలు చేయగలిగే ప్రతిభ అతని సొంతం. ఆ కారణంగానే గేల్‌ను యూనివర్స్ బాస్ అంటారు. సీఎస్‌కే జట్టులో ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నా' అని వాట్సన్ అన్నాడు.

జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడం ఆనందాన్నిచ్చింది
రాత్రి జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించడం ఆనందాన్ని ఇచ్చిందని అన్నాడు. ఐపీఎల్ 11వ సీజన్‌లో క్రిస్ గేల్ తర్వాత సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా వాట్సన్ నిలిచాడు. అంతకముందు సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది బెంగళూరు తరపున ఆడిన ఈ ఇద్దరూ ప్రస్తుతం వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications