బెంగళూరు రికార్డు బద్దలు కొట్టిన చెన్నై: కానీ, కోహ్లీని అందుకోలేకపోయారు

హైదరాబాద్: గత ఆదివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో టోర్నీ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది.
తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఒక సీజన్‌లో అత్యధిక సిక్సులు నమోదు చేసిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. గత 11 ఏళ్ల ఐపీఎల్ సీజన్లలో ఏ ఒక్క జట్టు కూడా ఈ రికార్డుని ఇప్పటివరకు నమోదు చేయలేదు. ఏప్రిల్ 7న ప్రారంభమైన ఐపీఎల్ 11వ సీజన్ మే 27తో ముగిసింది.

తొలి మ్యాచ్‌లోనే చెన్నై విజయం
రెండేళ్లు విరామం తర్వాత ఐపీఎల్ 11వ సీజన్‌లోకి పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ తన తొలి మ్యాచ్‌లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలపడింది. ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వరుస విజయాలను నమోదు చేసింది.

ఫైనల్లో హైదరాబాద్‌పై విజయం
ఇక, ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. వాంఖడె స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 10 సిక్స్‌లు నమోదు చేసింది. ఇక, ఈ సీజన్‌లో చెన్నై జట్టు నమోదు చేసిన మొత్తం సిక్సుల సంఖ్య 145.

ఒక సీజన్‌లో అత్యధిక సిక్సులు
గతంలో ఏ జట్టు ఒక సీజన్‌లో ఇన్ని సిక్స్‌లు బాదలేదు. 2016లో కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 142 సిక్స్‌లు బాదడమే ఇప్పటివరకు అత్యధికం. ఆ సీజన్‌లో ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మొత్తం 38 సిక్సులు బాదాడు. ఇప్పుడు ఈ రికార్డుని చెన్నై సూపర్ కింగ్స్ బద్దలు కొట్టింది.

145 సిక్సులు నమోదు చేసిన చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ 11వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 145 సిక్స్‌లు నమోదు చేసింది. ఈ సీజన్‌లో అత్యధిక సిక్సుల బాదిన ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు షేన్ వాట్సన్(35 సిక్సులు) ఉన్నాడు. ఇక, అత్యధిక సిక్స్‌లు బాదిన జట్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (130), కింగ్స్ ఎలెవన్ పంజాబ్(127), ముంబై ఇండియన్స్(120) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications