Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్: ఇక ధోనీతో పాటు చెన్నై సూపర్ కింగ్స్‌లోకి గంభీర్

IPL 2018: Chennai Super Kings to bid for Gautam Gambhir in auction?

హైదరాబాద్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)లో వరుస ఓటములతో సతమతమవుతున్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను తన అసమాన దూకుడు రెండు సార్లు విజేతగా నిలిపిన క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌. చక్కని వ్యూహాలతో ఇన్నాళ్లూ వెన్నెముకలా నిలిచిన గౌతీని తన వద్ద అట్టి పెట్టుకోకుండా కోల్‌కత్తా నైట్ రైడర్స్ వదిలేసింది.

అంతేగాక, రూ.21 కోట్లతో వెస్టిండీస్‌ ద్వయం సునీల్‌ నరైన్‌, అండ్రూ రసెల్‌‌లను రీటెయిన్‌ చేసింది. కోల్‌కత్తా వదిలేసిన గంభీర్‌ను వేలంలో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కొనుగోలు చేయనుందా! అనే సందేహాలు కొందరికి కలుగుతున్నాయి.

ఓ అభిమాని ఇదే అభిప్రాయం ట్వట్టర్ ద్వారా వ్యక్తం చేశాడు. వికాస్‌ కొఠారి అనే వ్యక్తి 'ఐపీఎల్‌ వేలంలో ఈ సారి గౌతమ్‌ గంభీర్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ తీసుకుంటుందని నాకు గాఢంగా అనిపిస్తోంది' అని ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు.

దానికి చెన్నై విచిత్రంగా బదులిచ్చింది. రెండు ఎమిటోకాన్స్‌ను ఉంచింది. ఇప్పుడీ విషయం వైరల్‌గా మారింది. వయసు మీద పడిందని గంభీర్‌ను షారుఖ్‌ వదిలేసినట్టు అందరూ భావిస్తున్నారు. ఐతే వేలంలో రైట్‌ టు మ్యాచ్‌ ద్వారా తక్కువ ధరకు సొంతం చేసుకోవాలన్నది వారి అసలు వ్యూహంగా కనిపిస్తోంది.

అన్నీ అనుకూలిస్తే తన మాతృభూమి ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌కు ఆడాలన్న కోరికను గతంలో గంభీర్‌ బయటపెట్టిన సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 8, 2018, 11:08 [IST]
Other articles published on Jan 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+