ఐపీఎల్ 2018లో మార్పులివే: రాత్రి 7 గంటలకే రెండో మ్యాచ్
హైదరాబాద్: ఐపీఎల్ 2018లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో మార్పు ఖాయంగా కనిపిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఇప్పటివరకు 10 సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ పది సీజన్లలో కూడా మొదటి మ్యాచ్ సాయంత్రం 4గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 8గంటలకు నిర్వహించేవారు.

రెండో మ్యాచ్ రాత్రి 7గంటలకు
అయితే ఐపీఎల్ 2018లో మాత్రం రెండో మ్యాచ్ రాత్రి 7గంటలకు నిర్వహించాలని ఐపీఎల్ నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. ఇందుకు కారణం కూడా ఉంది. రాత్రి 8గంటలకు ప్రారంభమయ్యే రెండో మ్యాచ్ ముగిసే సరికి అర్ధరాత్రి దాటుతోంది. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రేక్షకులు తిరిగి ఇంటికి చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.

ఇబ్బందికి గురవుతున్న అభిమానులు
ఇంటి దగ్గర ఉండి చూసే ప్రేక్షకులు సైతం మ్యాచ్‌లను వీక్షించడంలో కాస్తంత ఇబ్బందికి గురవుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు వచ్చే ఏడాది నుంచి రెండో మ్యాచ్‌ను సాయంత్రం 7గంటలకే ప్రారంభించాలన్న ప్రతిపాదనను ఫ్రాంఛైజీల ముందుంచారు. ఈ ప్రతిపాదనకు ప్రాంఛైజీలు ఆమోదం తెలపడంతో ఈ విషయమై ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా స్టార్ ఇండియాతో మాట్లాడనున్నారు.

స్టార్ ఇండియా ఓకే చెబితేనే
2018 ఐపీఎల్ ప్రసార హక్కులను స్టార్ ఇండియా దక్కించుకున్న సంగతి తెలిసిందే. స్టార్ ఇండియా ఓకే చెబితేనే మ్యాచ్ సమయంలో మార్పు ఉంటుందని అంటున్నారు. 'డిసెంబరు 5న ఢిల్లీలో స్టార్ ఇండియా ప్రతినిధులతో జరిగే సమావేశంలో ఈ అంశాన్ని వారి ముందు ఉంచుతాం. వారు అంగీకరిస్తే తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు, రెండో సాయంత్రం 7గంటలకే నిర్వహిస్తాం' అని రాజీవ్ శుక్లా చెప్పారు.

ప్లేయర్ ట్రాన్స్‌ఫర్ నిబంధన సైతం
దీంతో పాటు యూరోపియన్ ఫుట్ బాల్ లీగ్ మాదిరి ఆటగాళ్లు జట్టును మార్చుకునే 'మిడ్ డే టోర్నమెంట్ ప్లేయర్ ట్రాన్స్‌ఫర్' నిబంధనను తీసుకురాబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిబంధన ప్రకారం జట్టులోని ఆటగాడికి ఆ సీజన్‌లో జరిగే తొలి ఏడు మ్యాచుల్లో ప్రాంఛైజీ అవకాశం ఇవ్వకుంటే నిరభ్యంతరంగా మిగతా జట్లలోకి వెళ్లొచ్చు.

మిగతా ప్రాంచైజీలు కూడా ఆసక్తి
అయితే ఈ నిబంధన ఆటగాడి పట్ల మిగతా ప్రాంచైజీలు ఆసక్తిని కనబరిచినప్పుడే సాధ్యమవుతుందని అన్నారు. దీనికి కూడా ఫ్రాంచైజీలు కూడా ఓకే చెప్పాయని చైర్మర్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. చాలా మందికి తుది జట్టులో చోటు దక్కక అవకాశం కోల్పోతున్నారని, అలాంటివారికి ఇది మంచి అవకాశమని ఆయన అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications