Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్: కోహ్లీ, డివిలియర్స్‌తో ఆడాలనే నా కోరిక తీరనుంది

IPL 2018: Brendon McCullum posts message on joining RCB and playing along Virat Kohli, AB de Villiers

హైదరాబాద్: బెంగుళూరు వేదికగా జరిగిన రెండో రోజు ఐపీఎల్ వేలంలో మెక్‌కల్లమ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు కొనుగోలు చేసింది. ఈ న్యూజిలాండ్ ఆటగాడు గతేడాది జరిగిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో గుజరాత్‌ లయన్స్‌కు ప్రాతినిథ్య వహించాడు. ఈ సారి ఐపీఎల్లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)తరపున బరిలోకి ఆడనున్నాడు.

ఐపీఎల్ పూర్తి సమాచారం పట్టిక రూపంలో.. క్లిక్ చేయండి.

శని, ఆదివారాల్లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో మెకల్లమ్‌కు రూ. 3.60 కోట్లు వెచ‍్చించి ఆర్సీబీ దక్కించుకుంది. గత కొన్ని సీజన్లుగా ఆర్సీబీకి ఆడుతూ వస్తున్న క్రిస్‌ గేల్‌ను పక్కకు పెట్టిన ఆర్సీబీ యాజమాన్యం.. మెకల్లమ్‌పై ఎక్కువ ఆసక్తి చూపింది.

తనను ఆర్సీబీ కొనుగోలు చేయడంపై ట‍్విట్టర్‌ వేదికగా స్పందించిన మెకల్లమ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ఆర్సీబీ జట్టులో ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్‌ చేశాడు. దీనిలో భాగంగా విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌లతో కలిసి ఆడాలనే తన డ్రీమ్‌ అని మెకల్లమ్‌ తెలిపాడు.

ఐపీఎల్ వేలంలో ఆర్‌సీబీ మెక్ కెల్లమ్ రూ. 7.4 కోట్ల రూపాయలను వెచ్చించి అధిక మొత్తంలో కొనుగోలు చేసింది. ఇప్పటివరకూ ఐపీఎల్‌ టైటిల్‌ను గెలుచుకోని ఆర్‌సీబీ ఆర్‌సీబీ జట్టు ఈ ముగ్గురు స్టార్ క్రికెటర్లతో అయినా రాణించగలదేమో చూడాలి.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
1. విరాట్ కోహ్లి (రూ.17 కోట్లు-Retained)
2. ఏబీ డివిలియర్స్ (రూ.11 కోట్లు-Retained)
3. సర్ఫరాజ్ ఖాన్ (రూ.1.75 కోట్లు- Retained)
4. మెకల్లమ్ (రూ.3.6 కోట్లు)
5. క్రిస్ వోక్స్ (రూ.7.4 కోట్లు)
6. కొలిన్ గ్రాండ్‌హోమ్ (రూ.2.2 కోట్లు)
7. మొయిన్ అలీ (రూ1.7 కోట్లు)
8. క్వింటన్ డీకాక్ (ర.2.8 కోట్లు)
9. ఉమేష్ యాదవ్ (రూ.4.2 కోట్లు)
10. యజువేంద్ర చాహల్ (రూ.6 కోట్లు-RTM)
11. మనన్ వోహ్రా (రూ.1.1 కోట్లు)
12. కుల్వంత్ ఖేజ్రోలియా (రూ.85 లక్షలు)
13. అనికేత్ చౌదరి (రూ.30 లక్షలు)
14. నవదీప్ సైనీ (రూ.3 కోట్లు)
15. మురుగన్ అశ్విన్ (రూ.2.2 కోట్లు)
16. మణ్‌దీప్ సింగ్ (రూ.1.4 కోట్లు)
17. వాషింగ్టన్ సుందర్ (రూ.3.2 కోట్లు)
18. పవన్ నేగి (రూ.కోటి-RTM)
19. మహ్మద్ సిరాజ్ (రూ.2.6 కోట్లు)
20. నేథన్ కూల్టర్ నైల్ (రూ.2.2 కోట్లు)
21. అనిరుద్ధ జోషి (రూ.20 ల‌క్ష‌లు)
22. పార్థివ్ పటేల్ (రూ.1.7 కోట్లు)
23. టిమ్ సౌథీ (రూ.కోటి)
24. ప‌వ‌న్ దేశ్‌పాండె (రూ.20 ల‌క్ష‌లు)

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 29, 2018, 14:46 [IST]
Other articles published on Jan 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+