Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2018: బెంగళూరు-ఢిల్లీ మ్యాచ్ వేదిక మారింది

IPL 2018: Bangalore Delhi match venue changed

హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్ ఏప్రిల్ 7న జరిగే మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ఐపీఎల్ ప్రారంభ వేడుకలకు ముంబైలోని వాంఖడె స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈ వేడుకల అనంతరం డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు రెండేళ్ల విరామం తర్వాత పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనుంది.

ఇందుకోసం ఐపీఎల్ నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. అయితే షెడ్యూల్‌లో భాగంగా మే 12న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు-ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. అయితే అదే రోజు కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో ఆటగాళ్లకు భద్రత కల్పించడం సాధ్యం కాదని పోలీసుశాఖ స్పష్టం చేయగా మే 12న బెంగళూరు వేదికగా జరిగే మ్యాచ్‌ వేదికను మార్చాలని కోరుతూ బీసీసీఐ అధికారులకు కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (కేఎస్‌సీఏ) నిర్వాహకులు లేఖ రాశారు.

దీంతో ఈ మ్యాచ్‌కి సంబంధించిన వేదికను మార్చాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. వేరే వేదికలో మ్యాచ్ నిర్వహించాలని, అందుకు సన్నాహాలను ఐపీఎల్ నిర్వాహకులు ముమ్మరం చేశారు. త్వరలోనే వేదికను ప్రకటించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. మిగిలిన మ్యాచ్‌లు యాథావిధిగా బెంగళూరులోనే జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.

Story first published: Wednesday, March 28, 2018, 15:35 [IST]
Other articles published on Mar 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+