Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ వేలం 2018: రూ. 6.2 కోట్లు పలికాడు, ఎవరీ గౌతమ్ క్రిష్టప్ప

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌కు సంబంధించి బెంగళూరు వేదికగా జరిగిన రెండో రోజు జరిగిన వేలంలో 29 ఏళ్ల గౌతమ్ క్రిష్ణప్పను బిడ్డింగ్‌లో పోటీ పడి మరీ రాజస్థాన్ రాయల్స్ రూ. 6.20 కోట్లకు సొంతం చేసుకుంది. వేలంలోకి కనీస ధర రూ. 20 లక్షలతో వచ్చిన గౌతమ్ క్రిష్ణప్పకు అంత పెద్ద మొత్తం చెల్లించడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

 కనీస ధరతో పోలిస్తే 31 రెట్లు ఎక్కువ ధర

కనీస ధరతో పోలిస్తే 31 రెట్లు ఎక్కువ ధర

వేలంలో కనీస ధరతో పోలిస్తే 31 రెట్లు ఎక్కువ ధర పలికాడు. ఈ నేపథ్యంలో ఎవరీ గౌతమ్ క్రిష్ణప్ప అని అభిమానుల మదిలో ఓ ఆలోచన మొదలైంది. కర్ణాటక రంజీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న గౌతమ్ క్రిష్ణప్ప ఆదివారం జరిగిన వేలంలో భారీ ధర పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనదఖ్త్ రూ. 11.5 కోట్లకు, ఆండూ టై రూ. 7.2 కోట్లకు అమ్ముడుపోయినా పెద్దగా పట్టించుకోలేదు.

ఐపీఎల్ క్రిష్ణప్పను కోటీశ్వరుడుని చేసింది

ఐపీఎల్ క్రిష్ణప్పను కోటీశ్వరుడుని చేసింది

కానీ, ఓ అనామక ప్లేయర్‌గా వేలంలో అడుగుపెట్టిన క్రిష్ణప్ప ఏకంగా రూ.6.2 కోట్లకు అమ్ముడుపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అనామక ప్లేయర్లను ఐపీఎల్ కోటీశ్వరులను చేసింది అనడానికి ఇదే ఒక ఉదాహరణ. వేలంలో రూ. 12.5 కోట్లకు బెన్ స్టోక్స్‌ను, రూ. 11.5 కోట్లకు ఉనదఖ్త్‌ను సొంతం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టే క్రిష్ణప్పనూ కొనుగోలు చేసింది.

 ఎవరీ గౌతమ్ క్రిష్టప్ప?

ఎవరీ గౌతమ్ క్రిష్టప్ప?

బెంగళూరులో అండర్-15 జోనల్ టోర్నమెంట్ ద్వారా గౌతమ్ క్రిష్టప్ప ప్రొఫెషనల్ కెరీర్ మొదలైంది. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలవడంతో ఒక్కసారిగా స్టార్ డమ్ వచ్చింది. నవంబర్ 2012లో బెంగాల్‌పై కర్ణాటక తరుపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత 2016-17 రంజీ ట్రోఫీ సీజన్‌లో గౌతమ్ క్రిష్టప్ప తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.

వరుసగా రెండు సార్లు ఐదు వికెట్లు

వరుసగా రెండు సార్లు ఐదు వికెట్లు

ఢిల్లీ, అస్సాంలతో జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా రెండు సార్లు ఐదు వికెట్లు తీశాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో కర్ణాటక విజయం సాధించింది. గౌతమ్ క్రిష్టప్ప కెరీర్ బెస్ట్ గణాంకాలు మాత్రం 7/108. ఈ రంజీ ట్రోఫీలో గౌతమ్ క్రిష్టప్ప ప్రదర్శనను చూసిన ముంబై ఇండియన్స్ జట్టు గతేడాది జరిగిన వేలంలో అతడిని రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత లిస్ట్-ఏ క్రికెట్‌లో భాగంగా ఫిబ్రవరి 2017న విజయ హాజారే ట్రోఫీలో అరంగేట్రం చేశాడు.

 టీ20ల్లో మంచి రికార్డు

టీ20ల్లో మంచి రికార్డు

2017-18 రంజీ సీజన్‌లో అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో తన ఫస్ట్ క్లాస్ సెంచరీని నమోదు చేశాడు. టీ20ల్లో గౌతమ్ క్రిష్ణప్పకు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు గౌతమ్ క్రిష్ణప్ప 27 టీ20 మ్యాచ్‌లాడి 16.31 సగటు, 159 స్ట్రైక్ రేట్‌తో 310 పరుగులు చేశాడు. ఇక 28.95 సగటుతో 20 వికెట్లు కూడా తీశాడు. ఈ మధ్యే రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్లో ముంబైపై 6 వికెట్లు తీసి కర్ణాటక సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు.

Story first published: Monday, January 29, 2018, 10:33 [IST]
Other articles published on Jan 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+