ఐపీఎల్: ఆటగాళ్లకు జనవరిలో వేలం షురూ

హైదరాబాద్: క్రికెట్ అభిమానులను ఉరకలెత్తించే ఐపీఎల్ వేలం షురూ కాబోతుంది. 2018కి గాను పదకొండే ఐపీఎల్ సీజన్‌ను జరిపేందుకు నిర్వహకులు వేలం పాటను మొదలుపెట్టనున్నారు. దీనిని బెంగుళూరు వేదికగా జనవరి 27, 28తేతదీల్లో జరపనున్నారు. ఇదే తేదీకి జోహన్నస్‌బర్గ్‌లోని వాండరర్స్ వేదికగా దక్షిణాఫ్రికాకు భారత్ కు మధ్య టెస్ట్ జరగనుంది.
డిసెంబరు 6న జరిగిన సదస్సులో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తేదీలు ఆమోదించింది. బీసీసీఐ అనుమతి కోసం నిరీక్షించి అనంతరం తేదీలను ఖరారు చేసింది. ఈ వేలంలో ఒక్కో జట్టుకు ప్రధానమైన ఐదుగురు ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నారు. జనవరి 4వ తేదీకల్లా ఆడేందుకు ఆసక్తి చూపే వాళ్ల జాబితాను ప్రకటించాలని బీసీసీఐ ఉత్తర్వులు జారీ చేసింది.
25మంది ఉన్న బృందంతో ఈ వేలాన్ని నిర్వహించనున్నారు. ఒక్కో జట్టు రూ. 80కోట్లతో ఆరంభించనుంది. 2017లో జరిగిన వేలంలో రూ.66కోట్లకే ఉండగా 2018కి గాను దీనిని పెంచారు. క్రితం జరిగిన ఐపీఎల్‌లో వచ్చిన లాభాలను పరిగణనలోకి తీసుకునే వేలం ధరలను పెంచినట్లు నిర్వహకులు పేర్కొన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications