
హైదరాబాద్: ఐపీఎల్ అంటే క్రికెటర్లే ప్రధాన హైలెట్. లేదంటే ఏ జట్టు ఎంతకి కొన్నదో అనే ధరల పట్టికే కనపడుతుంది. కానీ, ఈ సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా ఐపీఎల్ వేదికకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. వేలంలో భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్ పక్కను కూర్చొని మొదటి రోజు వేలంలో పాల్గొంటున్న ప్రీతి జింటా ఉత్సాహంగా కనిపిస్తుంది.
ప్రీతి జింటా కింగ్స్ ఎలెవన్ జట్టు సహ యజమాని కావడంతో వేలంలో వారి జట్టు తరపున ఉత్సాహంగా పాల్గొంది. ప్రతి సారీ ధరను ప్రకటించేప్పుడు బోర్డు చూపెడుతూ కెమెరాలకు కనువిందు చేస్తుంది. బెంగుళూరులోని ఐటీసీ గార్డెనియా హోటల్‌లో జరుగుతున్న ఈ వేలం శనివారం 10 గంటల నుంచి మొదలైంది.
ఐపీఎల్ వేలాన్ని రిచర్డ్ మ్యాడ్లీ ప్రకటించగానే ప్రీతి జింటా మంచి జోష్‌ని ప్రదర్శిస్తున్నారు. స్క్రీన్‌పై కనిపించే కీలక ఆటగాళ్లను ప్రతి ఒక్కరిని కొనుగోలు చేయాలనే ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఈ సీజన్‌లో మొట్ట మొదటిగా శిఖర్ ధావన్‌ను ప్రీతి జింటా జట్టు చేజార్చుకోవడంతో రూ. 5.2 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది.
కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జుహాచావ్లా కూతురు జాన్వి మొహతా వేలంలోనూ, గ్లామర్ లోనూ ప్రీతి జింటాకు పోటీనిస్తుంది. ఇప్పటి వరకు ఐపీఎల్ వేలానికి హాజరైన జట్టు ప్రతినిధుల్లో జాన్వి చిన్న వయస్కురాలు. ఈమె కోల్ కత్తా నైట్ రైడర్స్ తరపున వేలంలో పాల్గొన్నారు.
ప్రీతి జింటా భారత్ ప్లేయర్లను బాగానే కొనుగోలు చేశారు. యువరాజ్ సింగ్ (రూ.2కోట్లు), కేఎల్ రాహుల్(రూ. 11 కోట్లు). దీంతో ఆ బాలీవుడ్ హీరోయిన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ పర్సన్‌గా మారారు. కొందరైతే వేలాన్ని మర్చిపోయి ప్రీతి జింటానే చూస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. సెహ్వాగ్ తన ట్వీట్ లో ప్రీతి జింటా షాపింగ్ మోడ్ లో ఉంది. అన్ని కొనేయాలనే ఉత్సాహంలో ఉంది. అని పేర్కొన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.