వికెట్ కీపర్‌గా క్రిస్ గేల్, ఒక్కడే ఐదు వికెట్లు తీశాడు

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు చెందిన అంకిత్ రాజ్‌పుత్ రికార్డు సృష్టించాడు. టోర్నీలో భాగంగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్ - కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ జట్టును ముప్పుతిప్పలు పెట్టాడు.
రాజ్‌పుత్ బౌలింగ్ మాయాజాలానికి సన్‌రైజర్స్ ఆటగాళ్లు ఆదిలోనే పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్లు శిఖర్ ధావన్, విలియమ్సన్‌ను దెబ్బతీసిన రాజ్‌పుత్ ఆ తర్వాత వచ్చిన సాహాను త్వరగానే వెనక్కి పంపాడు. దీంతో ఆరంభంలోనే సన్‌రైజర్స్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఆ తర్వాత మరోసారి విజృంభించిన రాజ్‌పుత్... మనీశ్ పాండే, మహమ్మద్ నబీ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ 11వ సీజన్‌లో ఒకే మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన మొదటి ఆటగాడిగా రాజ్‌పుత్ రికార్డు సృష్టించాడు.

ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నా:
ఈ సందర్భంగా రాజ్‌పుత్ మాట్లాడుతూ...‘ఈ మ్యాచ్‌లో ఎలా బౌలింగ్ చేయాలన్న దానిపై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నా. ఏ ఏ ప్రదేశాల్లో బంతి వేయాలనుకున్నానో అలాగే వేయగలిగా. ఈ రోజు నాది. అదృష్టం కలిసొచ్చింది. ఐదు వికెట్లు దక్కాయి' అని రాజ్‌పుత్ సంతోషంగా చెబుతున్నాడు.

పంజాబ్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి దూసుకెళ్లిన హైదరాబాద్:
అనంతరం సన్‌రైజర్స్ బౌలర్లు బంతితో మెరవడంతో ఈ మ్యాచ్‌లో పంజాబ్ 13 పరుగుల తేడాతో ఓడిమి పాలైంది. తాజా విజయంతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి దూసుకెళ్లింది. చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ ఈ ఆటలో మరో ఆశ్చర్యకరమైన సంఘటన సృష్టించాడు.

వికెట్ కీపర్‌లా మారి అభిమానుల్ని ఆశ్చర్యానికి:
ఈ సారి ఏకంగా మైదానంలో వికెట్ కీపర్‌లా మారి అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. టోర్నీలో భాగంగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్ - కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ స్థానంలో గేల్ చేతికి గ్లౌజులు తగిలించుకుని కాసేపు సందడి చేశాడు.
గేల్ వికెట్ల వెనక్కి వచ్చి రాహుల్ వదిలిన గ్లౌజులను:
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేసే సమయంలో ఆరో ఓవర్‌లో వికెట్ కీపర్‌గా ఉన్న కేఎల్ రాహుల్ కాస్త విరామం తీసుకుని మైదానాన్ని వీడాడు. ఈ సమయంలో మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న గేల్ వికెట్ల వెనక్కి వచ్చి రాహుల్ వదిలి వెళ్లిన గ్లౌజులు చేతికి ధరించాడు. వికెట్ల వెనుక పొజిషన్ చూసుకున్నాడు. అంతా ఓకే అనుకుని బౌలర్ బరిందర్ శరణ్‌ను బౌలింగ్ కూడా వేయమన్నాడు. ఇంతలో రాహుల్ మైదానంలోకి రావడంతో గ్లౌజులు రాహుల్‌కి ఇచ్చేసి యథావిధిగా ఫీల్డింగ్ చేసేందుకు వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘గేల్-ది వికెట్ కీపర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు గేల్ పార్ట్ టైమ్ వికెట్ కీపర్' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications