
హైదరాబాద్: ఐపీఎల్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ ముగిసింది. కోల్‌కతా ఇన్నింగ్స్ 17వ ఓవర్లో బెంగళూరు బౌలర్ మహ్మద్ సిరాజ్ వేసిన రెండో బంతికి నితీశ్ రాణా ఫోర్ బాదాడు. అనంతరం గాయం కారణంతో అతడు మైదానాన్ని వీడాడు. ఈ దశలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ క్రీజులోకి వచ్చాడు. మూడో బంతిని ఎదుర్కొన్న రసెల్ కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పరుగులేమీ చేయకుండా తొలి బంతికే గోల్డెన్ డక్‌గా అవుటవడంతో రసెల్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు.
దీంతో ఆండ్రీ రసెల్ పుట్టిన రోజైన ఆదివారం గోల్డెన్ డక్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. 30వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ(68 నాటౌట్) రాణించడంతో 20 ఓవర్లలో 4 వికెట్లకు 175 పరుగులు చేసింది. అనంతరం ఓపెనర్ క్రిస్‌లిన్(62 నాటౌట్) విజృంభించడంతో లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 4 వికెట్లను మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను చేధించిన కోల్‌కతా విజయాన్ని సొంతం చేసుకుంది.
గత మ్యాచ్‌లో చెన్నై చేతిలో దెబ్బ తిన్న బెంగళూరు.. ఆదివారం కోల్‌కతా చేతిలో ఓటమి చవిచూసింది. జ్వరం కారణంగా ఏబీ డివిలియర్స్ మ్యాచ్‌కు దూరమైనప్పటికీ.. కోహ్లి రాణించడంతో బెంగళూరు మొదట 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రి రసెల్ (3/31), కుల్‌దీప్ (1/20) సత్తా చాటారు. అనంతరం ఓపెనర్ క్రిస్ లిన్ రాణించడంతో కోల్‌కతా లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 4వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు బెంగళూరుకు మంచి అవకాశాలే వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. వరుస ఓటములకు గురవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంగళవారం ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. కోల్‌కతా జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.