ఐపీఎల్ 2018: అంబటి రాయుడి ఖాతాలో అరుదైన రికార్డు

హైదరాబాద్: గత పదేళ్ల ఐపీఎల్‌లో ఆటగాళ్లు కొత్త రికార్డులు నమోదు చేయడం.. అలాగే తమ ఖాతాలో చెత్త రికార్డులనూ నమోదు చేయడం ఎప్పటి నుంచో ఆనవాయితీ వస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్‌లో కొత్త రికార్డులు నమోదు కాగా, మరికొన్ని చెత్త రికార్డులు నమోదయ్యాయి.
రోహిత్ శర్మ ఈ సీజన్‌లో లీగ్ దశలో 14 మ్యాచ్‌ల్లో కేవలం 286 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి రోహిత్ శర్మ, సురేశ్ రైనా మాత్రమే ప్రతి సీజన్‌లోనూ 300లకు పైగా పరుగులు చేస్తూ వస్తున్నారు. కానీ, ఈ సీజన్‌లో రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన కారణంగా ఈ ఘనత సాధించలేకపోయాడు.
ఒక సీజనులో ఒక జట్టు మీద సెంచరీ సాధించి, మళ్లీ అదే జట్టు మీద మరో మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన ఆటగాళ్ల జాబితాలో చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు చేరాడు. లీగ్ దశలో ఇదే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించిన రాయుడు ప్లేఆఫ్ మ్యాచ్‌లో భాగంగా జరిగిన తొలి క్వాలిఫయిర్‌లో డకౌటయ్యాడు.

ముందు వరుసలో ఏబీ డివిలియర్స్
ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్ అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు. 2009లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన డివిలియర్స్.. చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ(105నాటౌట్)తో అద్భుత ప్రదర్శన చేశాడు. కానీ ఆ తర్వాత అదే చెన్నైతో జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం పరుగులేమీ చేయకుండా డకౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది.

డేవిడ్ వార్నర్ కూడా ఇలాంటి పరిస్థితే
2010లో ఢిల్లీ డేర్స్‌డెవిల్స్‌కు ఆడిన డేవిడ్ వార్నర్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ (107నాటౌట్) సెంచరీతో చెలరేగగా.. ఆ తర్వాత కోల్‌కతాతో జరిగిన మరో మ్యాచ్‌లో డకౌటయ్యాడు.

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్
2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించిన క్రిస్ గేల్ కూడా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసి ఆ తర్వాత అదే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు.

గుజరాత్ లయన్స్‌పై విరాట్ కోహ్లీ
2012లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మురళీ విజయ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో, 2016లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ గుజరాత్ లయన్స్‌తో ఆడిన మ్యాచ్‌లో సెంచరీ బాదగా ఆ తర్వాతి మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications