Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రిస్ గేల్‌కు బౌలింగ్ చేయడం ఎలా ఉంటుందంటే!: అభిమాని ఫన్నీ ట్వీట్

IPL 2018: All Hail King Gayle, Twitter reacts to Chris Gayles hundred against Hyderabad

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం రాత్రి పంజాబ్-హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాడు క్రిస్ గేల్ 63 బంతుల్లో 11 సిక్సులు, ఒక ఫోర్‌ సాయంతో 104 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు ఐపీఎల్ 11వ సీజన్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు.


తద్వారా ఐపీఎల్లో క్రిస్ గేల్ నమోదు చేసిన సెంచరీల సంఖ్య 6కు చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లీ (4), డేవిడ్ వార్నర్, ఏబీ డివిలియర్స్‌ (3) సెంచరీలతో ఉన్నారు. ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఆడని గేల్... చెన్నైతో మ్యాచ్‌లో జట్టులోకి వచ్చీ రాగానే 33 బంతుల్లో 63 పరుగులు చేశాడు.

ఆ తర్వాత సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ గేల్‌ కీలకపాత్ర పోషించి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులను దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.

అనంతరం 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 178/4కే పరిమితమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అభిమానులు సైతం గేల్‌ ఆటతీరుపై కొనియాడుతున్నారు. వేలంలో గేల్‌ను వదిలేసుకున్న ఆర్‌సీబీపై వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు.

Story first published: Friday, April 20, 2018, 15:52 [IST]
Other articles published on Apr 20, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+