ఐపీఎల్ గురించి 10 నిజాలు: విలువైన ఆటగాళ్లు, అరుదైన రికార్డులు (ఫోటోలు)

Posted By:
IPL 2018: 10 lesser-known facts about the IPL

హైదరాబాద్: ఏప్రిల్ 7న ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఐపీఎల్ నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ రెండేళ్ల తర్వాత పునరాగమనం చేసిన చెన్నైతో తలపడనుంది.

గత పది సీజన్లుగా ఐపీఎల్ అభిమానులను అలరిస్తూనే ఉంది. అటు మైదానంలో ఇటు మైదానం వెలుపుల ఈ ఐపీఎల్ మ్యాచ్‌లు అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. కాబట్టే ఐపీఎల్ 11వ సీజన్ ఎప్పడెప్పుడు ప్రారంభం అవుతుందా? అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

ప్రతి సీజన్లో కొత్త ఆటగాళ్లు అలరిస్తున్నారు. ఒక సీజన్‌లో విరాట్ కోహ్లీ నాలుగు సెంచరీలు, పలువురు బౌలర్ల హ్యాట్రిక్ వికెట్లు, మైదానం బయట పడే సిక్సర్లు, సూపర్ ఓవర్లు ఇలా అన్నీ కలిసి ఐపీఎల్ 11వ సీజన్‌కు అంతా ముస్తాబైంది. ఈ సందర్భంగా ఐపీఎల్‌కు సంబంధించిన కొన్ని విషయాలు అభిమానుల కోసం...

ఐపీఎల్‌లో మొట్ట మొదటి, 500వ గేమ్ ఆడిన జహీర్ ఖాన్

ఐపీఎల్‌లో మొట్ట మొదటి, 500వ గేమ్ ఆడిన జహీర్ ఖాన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో మొట్టమొదటి గేమ్‌తో పాటు 500వ గేమ్ ఆడిన ఏకైక ఆటగాడు జహీర్ ఖాన్. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ తొలి సీజన్‌లో జహీర్ ఖాన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. బెంగళూరుతో జరిగిన ఈ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఆటగాడు బ్రెండన్ మెక్‌కల్లమ్ ఐపీఎల్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. అలాగే జహీర్ ఖాన్ ఐపీఎల్‌లో 500వ గేమ్ ఆడాడు. ఐపీఎల్ 8వ సీజన్‌లో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ ఢిల్లీ డేర్ డెవిల్స్-రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు తరుపున జహీర్ ఖాన్ ప్రాతినిథ్యం వహించాడు.

386 ఓవర్ల తర్వాత నోబాల్ వేసిన పియూష్ చావ్లా

386 ఓవర్ల తర్వాత నోబాల్ వేసిన పియూష్ చావ్లా

తన ఐపీఎల్ కెరీర్‌లో 386 ఓవర్లు వేసిన తర్వాత పియూష్ చావ్లా నోబాల్ వేశాడు. ఐపీఎల్ మొట్టమొదటి సీజన్ 2008లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. 2016లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో చావ్లా ఈ నోబాల్ వేశాడు. అంటే, ఐపీఎల్ ప్రారంభమైన 8 ఏళ్ల తర్వాత చావ్లా నోబాల్ వేశాడమన్నమాట. తన ఐపీఎల్ కెరీర్‌ను 2008లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో ప్రారంభించాడు. ప్రాంఛైజీ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఆ తర్వాత ఐపీఎల్ 7వ సీజన్‌లో చావ్లాను కోల్‌కతా నైట్ రైడర్స్ వేలంలో దక్కించుకుంది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో చావ్లాను కోల్‌కతా జట్టు రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా వేలంలో దక్కించుకుంది.

ఒకే ఫ్రాంచైజీలో వంద గేమ్‌లు..

ఒకే ఫ్రాంచైజీలో వంద గేమ్‌లు..

ఐపీఎల్ ప్రారంభమైన 2008 సంవత్సరం నుంచి ఒకే ఫ్రాంచైజీ తరఫున వంద మ్యాచ్‌లు ఆడిన విదేశీ క్రికెటర్లుగా కీరోన్ పొలార్డ్, ఏబీ డివిలియర్స్ నిలిచారు. ప్రతి ఫ్రాంచైజీలోనూ ఆటగాళ్ల ఎంపికలో ఎన్నో మార్పులు, చేర్పులు జరిగినా ఈ ఇద్దరూ వంద మ్యాచ్‌ల వరకు ఒక ఫ్రాంచైజీ తరఫున ఆడడం గమనార్హం. పొలార్డ్ 2010లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లోకి ప్రవేశించి, ఇప్పటివరకు ఇదే జట్టు తరఫున 123 గేమ్‌లు ఆడాడు. అదేవిధంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌లో చోటు దక్కించుకుని తొలిసారిగా ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఏబీ డివిలియర్స్ 2011 నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున కొనసాగుతున్నాడు. ఈ టీమ్ తరఫున డివిలియర్స్ ఇప్పటివరకు 101 మ్యాచ్‌లు ఆడాడు.

 ఐపీఎల్‌లో అత్యత్తమ స్పెల్ ఆశిష్ నెహ్రాదే

ఐపీఎల్‌లో అత్యత్తమ స్పెల్ ఆశిష్ నెహ్రాదే

గత పది సీజన్ల ఐపీఎల్‌లో అత్యుత్తమ ఎకనమిక్ స్పెల్స్ వేసిన బౌలర్లుగా ఆశిష్ నెహ్రా, ఫైడల్ ఎడ్వర్డ్స్ నిలిచాడు. వీరిద్దరూ ఓ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 6 పరుగులిచ్చారు. ఇందులో ఒక ఓవర్ మెయిడిన్ ఓవర్ కాగా, ఒక వికెట్ లభించింది. 2009లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఆశిష్ నెహ్రా పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఇక, వెస్టిండిస్‌కు చెందిన ఫైడల్ ఎడ్వర్డ్స్ డెక్కన్ ఛార్జర్స్ తరుపున ఆడినప్పుడు ఈ ఘనత సాధించాడు.

ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడు దినేశ్ కార్తీక్

ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడు దినేశ్ కార్తీక్

ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటివరకు 152 మ్యాచ్‌లాడిన దినేశ్ కార్తీక్ 88 క్యాచ్‌లు పట్టాడు. అదే సమయంలో 26 స్టంపింగ్స్ చేశాడు. గత పదేళ్ల ఐపీఎల్ సీజన్లలో దినేశ్ కార్తీక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ 11వ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు.

ఐపీఎల్‌లో విలువైన ఆటగాళ్లు

ఐపీఎల్‌లో విలువైన ఆటగాళ్లు

ఐపీఎల్ చరిత్రలో కేవలం ఇద్దరు భారతీయులకు మాత్రమే అత్యంత విలువైన ఆటగాళ్లుగా అవార్డు లభించింది. మొదట సచిన్ టెండూల్కర్, ఆ తర్వాత విరాట్ కోహ్లీకి ఈ అవార్డు దక్కింది. 2010 ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన సచిన్ 618 పరుగులు చేశాడు. ఒక సీజన్‌లో ఎక్కువ పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. 2015 ఐపీఎల్‌లో కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ సీజన్‌లో అతను 973 పరుగులు చేయడం విశేషం. అందుకు తగ్గట్టుగానే ఆరెంజ్ క్యాప్‌తోపాటు విలువైన ఆటగాడిగా అవార్డు కూడా ఇతనికి దక్కింది. కాగా, ఆస్ట్రేలియా ఆటగాడు షేన్ వాట్సన్ రెండుసార్లు ఈ అవార్డును గెల్చుకున్నాడు. గిల్‌క్రిస్ట్, గ్లేన్ మాక్స్‌వెల్ ఒక్కోసారి ఈ అవార్డుని అందుకున్నారు.

ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బంతి

ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బంతి

గత పది ఐపీఎల్ టోర్నీలలో ఎంతోమంది సమర్థులైన బౌలర్లు తమ ప్రతిభా పాటవాలను నిరూపించుకున్నారు. అయితే, మెరుపు వేగంతో బంతులు వేసిన ఘనత ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్‌కు దక్కింది. గత సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అతను ఓ మ్యాచ్‌లో గంటకు 153.56 కిలోమీటర్ల వేగంతో బంతులు వేశాడు. కమిన్స్ సగటు వేగం గంటకు 145 కిలోమీటర్లంటే అతని బంతులు ఎంత వేగంగా దూసుకొస్తాయో ఊహించుకోవచ్చు.

ఎక్కువ డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా ప్రవీణ్ కుమార్

ఎక్కువ డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా ప్రవీణ్ కుమార్

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా ప్రవీణ్ కుమార్ నిలిచాడు. అన్ని సీజన్లు కలిపి ప్రవీణ్ కుమార్ మొత్తం 1075 డాట్ బాల్స్ వేశాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో ప్రవీణ్ కుమార్ ఇప్పటివరకు 420.4 ఓవర్లు బౌలింగ్ చేశాడు. మొత్తం 119 మ్యాచ్‌లాడిన ప్రవీణ్ కుమార్ 90 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రవీణ్ కుమార్ ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.

ఐపీఎల్‌లో 13 సార్లు డకౌట్ అయిన భజ్జీ

ఐపీఎల్‌లో 13 సార్లు డకౌట్ అయిన భజ్జీ

ఐపీఎల్‌లో 13 సార్లు డకౌట్ అయిన చెత్త రికార్డు టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పేరిట ఉంది. ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో చివరి ఓవర్లలో బ్యాటింగ్‌కు దిగే భజ్జీ దూకుడుగా ఆడే క్రమంలో ఇన్నిసార్లు డకౌటయ్యాడు. అంతకాదు డెత్ ఓవర్లలో బ్యాటింగ్‌కు దిగే భజ్జీ మెరుపులు కూడా మెరిపించిన సంగతి తెలిసిందే. గత పది సీజన్లలో హర్బజన్ సింగ్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో భజ్జీని చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, April 6, 2018, 13:03 [IST]
Other articles published on Apr 6, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి