ఐపీఎల్ 10వ సీజన్ ప్రారంభ వేడుకలు అనంతరం జరిగిన తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటూనే ఉన్నారు.
తాజాగా హైదరాబాద్ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రా, శిఖర్ ధావన్ హోటల్ గదిలో ఓ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. వీరంతా కలిసి డ్యాన్స్ చేసిన వీడియోని శిఖర్ ధావన్ ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్రాక్టీస్ సెషన్ ముగిసిన అనంతరం హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు అభిమానులతో కలిసి బిలియర్డ్స్ ఆడుతూ సందడి చేశారు. ఇదిలా ఉంటే ఆదివారం హైదరాబాద్ జట్టు తన తదుపరి మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది.