ఐపీఎల్ గురించి తెలుసుకోండి: కోహ్లీనే టాప్, 40 ఏళ్ల హాగ్, ఆడిన జట్లు 13
హైదరాబాద్: నగరానికి ఐపీఎల్ కళ వచ్చేసింది. ఐపీఎల్ ప్రారంభ వేడుకలకు ఉప్పల్ స్టేడియం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఇప్పటికే స్టార్ క్రికెటర్లందరూ నగరానికి విచ్చేశారు. బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ప్రారంభోత్సవానికి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే తొలి మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
తొలి మ్యాచ్‌కు ముందు ప్రారంభ వేడుకలను ఘనంగా జరగనున్నాయి. సాయంత్రం 6.30 గంటలకు జరిగే ఈ వేడుకల్లో బాలీవుడ్ ముద్దుగుమ్మ అమీ జాక్సన్ తన డ్యాన్స్‌తో సందడి చేయనుంది. మూడు వందల మంది కళాకారులతో కలిసి అమీ జాక్సన్ సందడి చేయనుంది. రాష్ట్ర సంస్కృతిని తెలిపే నృత్య రూపకాలను ప్రదర్శించే అవకాశం ఉంది.
కాగా, ఓవరాల్‌గా ఉప్పల్‌లో 21 నిమిషాల పాటు ఆరంభ వేడుకలు నిర్వహిస్తారు. సాయంత్రం 6.30కు మొదలై 6.51 గంటలకు ముగుస్తుంది. అమీ ప్రదర్శన తర్వాత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్‌లను బీసీసీఐ సన్మానించనుంది.
దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్‌లు గోల్ఫ్ కార్ట్‌లలో మైదానంలోకి ప్రవేశిస్తారు. ఆపై వీరి ఘనతలు, సాధించిన రికార్డులను గురించి ప్రస్తావిస్తూ, ఆడియో, వీడియో ప్రదర్శన ఉంటుంది. అనంతరం ఐదుగురు క్రికెటర్లు మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి రవిశాస్త్రి కామెంటేటర్‌గా వ్యవహరించనున్నారు.
ఆ తర్వాత కాసేపు సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ క్రికెటర్ల వామప్ తర్వాత తొలి మ్యాచ్ మొదలవుతుంది. బుధవారం పదో సీజన్‌కు సంబంధించిన వేడుకలు అంగరంగ వైభవంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో గత సీజన్లకు సంబంధించిన రికార్డులను ఒక్కసారి పరిశీలిద్దాం...

బ్రాడ్ హాగ్‌కు 40 ఏళ్లు
40 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసులో ఐపీఎల్ ఆడిన ఆటగాళ్ల సంఖ్య 9 మందిగా ఉంది. అతిపెద్ద వయస్కుడి రికార్డు బ్రాడ్ హాగ్‌దే. అతడు 45 ఏళ్లు 92 రోజుల వయసులో ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు.

ఐపీఎల్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లు 578
గత తొమ్మిది సీజన్లుగా ఐపీఎల్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లు 578. 262 సార్లు టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 316 సందర్భాల్లో బౌలింగ్‌కు ఎంచుకోవడం విశేషం.

ఇప్పటివరకు ఐపీఎల్ ఆడిన జట్లు 13
ఇప్పటివరకు ఐపీఎల్ ఆడిన జట్లు 13. ఇక ఐపీఎల్‌లో ఆడిన ఆటగాళ్ల సంఖ్య 471. ఇక్కడ విశేషం ఏమిటంటే 35 మంది ఒకే ఒక్క మ్యాచ్ ఆడారు.

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీ 4110
ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ: 4110 పరుగులు
అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్లలో లతీష్ మలింగ: 143 వికెట్లు
అత్యధిక వ్యక్తిగత స్కోరు క్రిస్ గేల్: 175 నాటౌట్
అత్యధిక క్యాచ్ లు అందుకుంది సురేశ్ రైనా: 82
అత్యధిక సిక్సర్లు క్రిస్ గేల్: 251
అత్యధిక అర్ధసెంచరీలు డేవిడ్ వార్నర్: 34
ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు సురేశ్ రైనా: 147

ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు క్రిస్ గేల్
ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ ఉన్నాడు. ఇప్పటివరకు క్రిస్ గేల్ 5 సెంచరీలు చేశాడు. గేల్ తర్వాతి స్ధానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ నాలుగు సెంచరీలు చేశాడు. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. డివిలియర్స్ మూడు సెంచరీలు చేశాడు. ఈ ముగ్గురూ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు చెందినవారే.

గత ఐపీఎల్ విజేతలు
2008 - రాజస్థాన్ రాయల్స్
2009 - డెక్కన్ ఛార్జర్స్
2010 - చెన్నై సూపర్ కింగ్స్
2011 - చెన్నై సూపర్ కింగ్స్
2012 - కోల్ కతా నైట్ రైడర్స్
2013 - ముంబై ఇండియన్స్
2014 - కోల్ కతా నైట్ రైడర్స్
2015 - ముంబై ఇండియన్స్
2016 - సన్ రైజర్స్ హైదరాబాద్

9 సార్లు హైదరాబాద్, బెంగళూరు ముఖాముఖి
ఐపీఎల్‌లో హైదరాబాద్, బెంగళూరు జట్లు 9సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో హైదరాబాద్ 5 మ్యాచ్‌లు, బెంగళూరు 4 మ్యాచ్‌లు గెలిచాయి. 2014 నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్‌లో తొలి ఇన్నింగ్స్‌లో నమోదైన సగటు స్కోరు 158 పరుగులు. అప్పటినుంచి జరిగిన 15 మ్యాచుల్లో 12సార్లు లక్ష్యఛేదనకు దిగిన జట్టే గెలిచింది. ఓవరాల్‌గా చూస్తే సొంతగడ్డపై హైదరాబాద్ 8మ్యాచ్‌లాడి ఏడింటిలో గెలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications